తెలంగాణ

telangana

ETV Bharat / sports

వచ్చే ఐపీఎల్​లో కప్​ మాదే : రికీ పాంటింగ్​ - ricky ponting

2021 ఐపీఎల్​ సీజన్​లో తమ జట్టు ట్రోఫీని సొంతం చేసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశాడు దిల్లీ క్యాపిటల్స్​ హెడ్​ కోచ్​ రికీ పాంటింగ్​. ఈ సీజన్​లో తమ ఆటగాళ్లు అద్భుతంగా రాణించారని కొనియాడాడు.

Ricky Ponting
రికీపాంటింగ్

By

Published : Nov 14, 2020, 7:12 PM IST

2020 ఐపీఎల్​ సీజన్​లో ఫైనల్​ వరకు వచ్చి ఓడిపోవడం చాలా బాధగా ఉందని అన్నాడు దిల్లీ క్యాపిటల్స్​ హెడ్​ కోచ్​ రికీ పాంటింగ్. ఈ సీజన్​ ఆద్యంతం తమ ఆటగాళ్లు బాగా ప్రదర్శన చేశారని కొనియాడాడు. ​వచ్చే సీజన్​లో తమ జట్టు మరింత బలంగా తయారై బరిలో దిగుతుందని అన్నాడు. గెలిచి తమ సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశాడు. ​

ఈ సీజన్​లో దిల్లీ ఫైనల్​కు చేరుకోవడానికి కోచింగ్​ సిబ్బంది మహ్మద్​ కైఫ్, విజయ్​ దాహియా, రియాన్​ హ్యారిస్​ బాగా తోడ్పడ్డారని.. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు. ​

ఇదీ చూడండి : రీక్షల్లో నెగిటివ్.. టీమ్​ఇండియా ప్రాక్టీస్​ షురూ

ABOUT THE AUTHOR

...view details