అబుదాబి వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఘన విజయం సాధించింది దిల్లీ క్యాపిటల్స్. ఈ గెలుపుతో ప్లేఆఫ్స్ స్థానాన్ని పదిలం చేసుకుంది. దిల్లీ విజయంలో రహానే(60) కీలక పాత్ర పోషించాడు. అయితే ఈసారి దిల్లీ తరఫున కేవలం ఆరు మ్యాచుల్లోనే ఆడాడు రహానే. దీనిపై స్పందిస్తూ ఈ సీజన్లో అన్ని మ్యాచుల్లో ఆడలేకపోయినందుకు బాధపడ్డానని తెలిపాడు.
"ఈ సీజన్లో అన్ని మ్యాచుల్లో ఆడలేకపోయినందుకు నిరాశకు గరయ్యా. కానీ, బెంగళూరుపై విజయం సాధించాక చాలా ఆనందం కలిగింది. ధావన్‌తో కలిసి క్రీజు పంచుకోవడాన్ని ఆస్వాదించా. అతని బ్యాటింగ్ స్టైల్ నుంచి నేను చాలా నేర్చుకున్నా. నేను మూడో స్థానంలో ఆడుతున్నానని తెలిసినప్పుడు మంచి ఆవకాశం దొరికిందని అనుకున్నా. క్లిష్ట పరిస్థితుల్లో మనం భాగస్వాములయ్యాక ఆ మ్యాచ్ గెలిస్తే రెట్టింపు ఆనందం కలగుతుంది."