తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ధోనీ జీనియస్.. ముంబయితో మ్యాచ్​లో ఆలోచన అదుర్స్' - ipl news updates

ముంబయితో మ్యాచ్​లో ధోనీ కంటే ముందు బ్యాటింగ్​కు వచ్చాడు యువ ఆల్​రౌండర్ సామ్ కరన్. అందుకు గల కారణాన్ని ఇతడు వెల్లడించాడు.

ipl
సామ్​ కరన్​

By

Published : Sep 20, 2020, 4:34 PM IST

Updated : Sep 25, 2020, 5:59 PM IST

ఐపీఎల్​ ప్రారంభ​మ్యాచ్​లో ముంబయిపై చెన్నై సాధించిన విజయం వెనక ధోనీ పక్కా ప్లానింగ్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. మ్యాచ్​ పరిస్థితిని అంచనా వేసి బ్యాటింగ్​ ఆర్డర్​ను మార్చి, తన స్థానంలో సామ్ కరన్​ను పంపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇదే విషయమై ధోనీపై ప్రశంసలు కురిపించాడు సామ్. అతడు ఓ మేధావి అని పేర్కొన్నాడు.

ధోనీ

"ధోనీ కంటే ముందు బ్యాటింగ్​కు వెళ్లమని చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయా. కానీ అతడో మేధావి. ఆలోచనలు చాలా స్పష్టంగా ఉంటాయి. నేను మైదానంలో వెళ్లే సమయానికి కృనాల్​ పాండ్య బౌలింగ్​. మ్యాచ్​ గెలవాలంటే లెఫ్ట్​- రైట్​ హ్యాండ్​ బ్యాట్స్​మెన్​ కాంబో అవసరమని ముందుగానే గుర్తించిన మహీ అలా ప్రణాళిక వేశాడు."

సామ్ కరన్​, సీఎస్కే క్రికెటర్​

18వ ఓవర్​లో జడేజా ఔటయ్యే సమయానికి చెన్నై, 17 బంతుల్లో 29 పరుగులు చేయాలి. ఆ తర్వాత ధోనీనే బరిలోకి దిగుతాడని అందరూ అనుకున్నారు. కానీ సామ్ కరన్​ క్రీజులోకి వచ్చాడు. ఆరు బంతులు ఆడి.. రెండు సిక్సులు, ఒక ఫోరు కొట్టి మ్యాచ్​ విజయానికి దగ్గర చేశాడు.

మ్యాచ్​లను మలుపు తిప్పడంలో గతంలోనూ ఇటువంటి వ్యూహాలు ఎన్నో రచించాడు ధోనీ. 2007 టీ20 ప్రపంచకప్​ ఫైనల్​లో ఆల్​రౌండర్​ జోగిందర్​ శర్మతో చివరి ఓవర్​ వేయించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

సీఎస్కే తర్వాత మ్యాచ్​ రాజస్థాన్​ రాయల్స్​తో సెప్టెంబరు 22న జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు మొదలు కానుంది.

Last Updated : Sep 25, 2020, 5:59 PM IST

ABOUT THE AUTHOR

...view details