సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై బెంగళూరు జట్టు పది పరుగులు తేడాతో విజయం సాధించింది. హైదబాబాద్ జట్టును 153 పరుగులకే ఆల్ఔట్ చేసింది. బెంగళూరు విజయంలో చాహల్, శివమ్ దుబే, నవదీప్ సైని కీలక పాత్రపోషించారు.
సన్‌రైజర్స్‌పై ఆర్సీబీ విజయం - ఐపీఎల్ 2020 వార్తలు
23:29 September 21
23:16 September 21
హైదరాబాద్ ఎనిమిది వికెట్లు కోల్పోయింది. ఓటమి అంచులో ఉంది. 18ఓవర్లకు స్కోరు 143 ఉంది.
22:29 September 21
హైదరాబాద్ రెండో వికెట్ కోల్పోయింది. 34 పరుగులు చేసిన మనీశ్ పాండే.. చాహల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ప్రస్తుతం 12 ఓవర్లో 89 పరుగులు చేసింది వార్నర్‌సేన.
22:14 September 21
హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ చాలా చక్కగా ఆడుతున్నారు. మరో వికెట్ పడకుండా స్కోరు బోర్డును నెమ్మదిగా పరుగులు పెట్టిస్తున్నారు. క్రీజులో మనీశ్ పాండే(31), బెయిర్ స్టో(39) ఉన్నారు. ప్రస్తుతం 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 78 పరుగులు చేసింది.
21:50 September 21
హైదరాబాద్ బ్యాట్స్‌మన్ నిలకడగా ఆడుతున్నారు. స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. 5 ఓవర్లలో వికెట్ నష్టానికి 40 పరుగులు చేశారు. క్రీజులో బెయిర్‌స్టో, మనీశ్ పాండే ఉన్నారు.
21:35 September 21
ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన కెప్టెన్ వార్నర్.. అనుహ్య రీతిలో రనౌట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం 2 ఓవర్లకు 18 పరుగులు చేసింది. క్రీజులో బెయిర్‌స్టో, మనీశ్ పాండే ఉన్నారు.
21:08 September 21
బెంగళూరు జట్టు అదరగొట్టింది. హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్(56) అరంగేట్రంలోనే అర్థశతకం చేసి ఆకట్టుకున్నాడు. అనంతరం డివిలియర్స్(51) ఆ ఊపు కొనసాగించాడు. మిగతా వారిలో ఫించ్ 29, కోహ్లీ 14 పరుగులు చేశారు. సన్‌రైజర్స్ బౌలర్లలో నటరాజన్, విజయ్ శంకర్, అభిషేక్ శర్మ తలో వికెట్ తీశారు.
20:48 September 21
నటరాజన్ బౌలింగ్‌లో కోహ్లీ క్యాచ్ ఔటయ్యాడు. కేవలం 14 పరుగులే చేసి పెవిలియన్ బాట పట్టాడు. ప్రస్తుతం క్రీజులో డివిలియర్స్ ఉన్నాడు. 15.5 ఓవర్లలో 123/3 ఉంది బెంగళూరు.
20:42 September 21
కోహ్లీ-డివిలియర్స్ నిదానంగా ఆడుతున్నారు. ప్రస్తుతం 15 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది బెంగళూరు జట్టు.
20:28 September 21
అద్భుత ప్రదర్శన చేసిన యువ బ్యాట్స్‌మన్ దేవ్‌దత్ పడిక్కల్ 42 బంతుల్లో 56 పరుగులు చేసి ఔటయ్యాడు. వెంటనే ఫించ్(29) కూడా ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ప్రస్తుతం 11.1 ఓవర్లలో 90 పరుగులతో ఉంది.
20:17 September 21
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్లు ఫించ్-దేవ్‌దత్ పడిక్కల్ నిలకడగా ఆడుతున్నారు. 10 ఓవర్ల ముగిసేసరికి వికెట్లేమి నష్టపోకుండా 86 పరుగులు చేశారు. ఈ క్రమంలోనే దేవ్‌దత్ ఐపీఎల్లో తొలి అర్థ శతకాన్ని నమోదు చేశాడు.
19:58 September 21
ఆర్సీబీ నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. ఓపెనర్లుగా దిగిన ఫించ్(12 ), పడిక్కల్(37 )స్కోరును పరుగులు పెట్టిస్తూనే వికెట్ పడకుండా చూసుకుంటున్నారు. 6 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ స్కోరు 53/0
19:44 September 21
మూడు ఓవర్లు పూర్తయ్యేసరికి ఆర్సీబీ 20/0 పరుగుల వద్ద నిలిచింది. క్రీజులో ఫించ్(2), పడిక్కల్(17) ఉన్నారు.
19:32 September 21
తొలి ఓవర్ ముగిసేసరికి వికెట్లేమి నష్టపోకుండా 2 పరుగులు చేసింది బెంగళూరు. క్రీజులో అరోన్ ఫించ్, దేవ్‌దత్ ఉన్నారు.
19:15 September 21
భారత అండర్-19 కెప్టెన్ ప్రియమ్ గార్గ్(హైదరాబాద్).. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ అరంగేట్రం చేస్తున్నాడు. అతడికి క్యాప్ ఇచ్చి జట్టులోకి ఆహ్వానించారు.
జట్లు వివరాలు
సన్‌రైజర్స్ హైదరాబాద్:డేవిడ్ వార్నర్ (కెప్టెన్) జానీ బెయిర్‌స్టో(వికెట్ కీపర్) మనీశ్ పాండె, విజయ్ శంకర్, మిచెల్ మార్ష్, ప్రియమ్ గార్గ్, అభిషేక్ శర్మ, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, టీ నటరాజన్
రాయల్ ఛాలెంజర్స్: అరోన్ ఫించ్, దేవ్‌దత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), ఏబీ డివిలియర్స్, జోష్ ఫిలిప్పీ(వికెట్ కీపర్), శివం దుబే, వాషింగ్టన్ సుందర్, ఉమేశ్ యాదవ్, నవదీప్ సైని, స్టెయిన్, యజ్వేంద్ర చాహల్
19:04 September 21
టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్ ఘనంగా బోణీ కొట్టాలని కెప్టెన్ వార్నర్ భావిస్తున్నాడు. కోహ్లీసేన బ్యాటింగ్ ప్రారంభించనుంది.
18:27 September 21
మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం
దుబాయ్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు మొదలవుతుంది. గెలిచేందుకు ఇరుజట్లు పట్టుదలగా ఉన్నాయి.