షార్జా వేదికగా చెన్నైపై అద్భుత విజయంతో రాజస్థాన్ బోణీ కొట్టింది. మరోవైపు దిల్లీ చేతిలో ఓడి, బెంగళూరుపై గెలిచి ఊపుమీదుంది పంజాబ్. ఇప్పుడీ జట్లు ఆదివారం తలపడేందుకు సిద్ధమయ్యాయి. రెట్టింపు జోరుతో బరిలో దిగుతున్నాయి. కచ్చితమైన వ్యూహాలతో పాయింట్లు పెంచుకోవాలని భావిస్తున్నాయి. ఈ సందర్భంగా ఇరుజట్ల బలాలు, బలహీనతలపై ఓ లుక్కేద్దాం.
రాజస్థాన్ రాయల్స్
చెన్నైతో మ్యాచ్‌లో రాజస్థాన్ గెలవడంలో సంజూ శాంసన్(74), కెప్టెన్ స్టీవ్ స్మిత్(69) కీలకపాత్ర పోషించారు. చివర్లో వచ్చిన ఆర్చర్.. బంతుల్ని బాది బౌలర్‌కు చుక్కలు చూపించాడు. వీరితో పాటు ఓపెనర్లు జైస్వాల్, ఉతప్ప లాంటి స్టార్ బ్యాట్స్‌మన్ ఉండనే ఉన్నారు. రాహుల్ తెవాటియా, ఆర్చర్ లాంటి బౌలర్లు ఈ జట్టుకు బలం. ఇదే జోరుతో బరిలోకి దిగుతున్న రాజస్థాన్.. పంజాబ్‌పై గెలుస్తుందో లేదో?
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్
దిల్లీపై ఓడి, బెంగళూరుపై విజయఢంకా మోగించింది పంజాబ్. ఆర్సీబీతో మ్యాచ్‌లో కెప్టెన్ రాహుల్(132) పలు రికార్డులు సొంతం చేసుకున్నాడు. ఆసీస్ ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్(5) మాత్రం నిరాశపరిచాడు. బౌలింగ్‌లో మురగన్ అశ్విన్, రవి బిష్ణోయ్, షెల్డన్ కాట్రెల్‌తో విభాగం బలంగా ఉంది. ఇప్పుడు రాజస్థాన్‌తో మ్యాచ్‌లో రాహుల్ వ్యూహం ఎలాంటి ఫలితాన్నిస్తుందో?