ఈ ఏడాది ఐపీఎల్లో డెత్ ఓవర్ల సమయంలో బ్యాటింగ్ పరంగా మంచి ప్రదర్శన ఇవ్వాలనుకుంటున్నట్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ తెలిపాడు. సెప్టెంబరు 19న ముంబయి, చెన్నై జట్ల మధ్య పోరుతో లీగ్ ప్రారంభమైంది. నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో సన్‌రైజర్స్ తలపడనుంది. ఈ సందర్భంగా ఆదివారం వర్చువల్ మీడియా సమావేశంలో మాట్లాడిన రషీద్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
"ఇన్నింగ్స్‌లో మూడు, నాలుగు ఓవర్లు మిగిలి ఉన్నప్పుడు.. బ్యాటింగ్ పరంగా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలనని నేను అనుకుంటున్నా. నేను బిగ్‌బాష్ లీగ్ ఆడుతున్న సమయంలో నా కోచ్ సిబ్బంది 15 ఓవర్ల తర్వాత ఎలా బ్యాటింగ్ చేయాలో సూచించారు. ఆ విధంగా కోచ్, కెప్టెన్ నుంచి మంచి స్పందన లభిస్తే.. అంతకంటే కావాల్సింది ఇంకేముంటుంది. కేవలం బ్యాటింగ్‌లోనే రాణించాలని నేను అనుకోవడం లేదు. మ్యాచ్ మొత్తంగా ఏ విధంగా నేను సాయపడగలనో ఆలోచిస్తుంటా. జట్టును విజయం వైపు నడిపించేందుకు నా వంతు కృషి చేస్తా."