తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోచ్, కెప్టెన్ సూచనలతో రాణించా: కమిన్స్ - పాట్​ కమిన్స్​ వార్తలు

సన్​రైజర్స్​ హైదరాబాద్​తో జరిగిన మ్యాచ్​లో తమ బౌలింగ్​ లైనప్​ గొప్పగా రాణించిందని అంటున్నాడు కోల్​కతా నైట్​రైడర్స్​ బౌలర్​ ప్యాట్ కమిన్స్. బ్యాటింగ్​, ఫీల్డింగ్​, బౌలింగ్​ వంటి ప్రతి విభాగంలోనూ సత్తాచాటామని తెలిపాడు.

IPL 2020: Pat Cummins rates KKR's bowling performance vs SRH
బౌలింగ్​ లైనప్​ రాణించడం శుభపరిణామం: కమిన్స్​

By

Published : Sep 27, 2020, 12:21 PM IST

శనివారం ఐపీఎల్​లో జరిగిన మ్యాచ్​లో తమ జట్టు బౌలింగ్​ లైనప్​ అద్భుతంగా రాణించిందని అంటున్నాడు కోల్​కతా నైట్​రైడర్స్​ బౌలర్​​ ప్యాట్​ కమిన్స్​. అందుకే సన్​రైజర్స్​ హైదరాబాద్​ జట్టుపై విజయం సాధించామని తెలిపాడు.

"టోర్నీలో మొదటి విజయం గొప్ప అనుభూతినిచ్చింది. మ్యాచ్​కు ఒకరోజు ముందు అద్భుత ప్రాక్టీసు సెషన్​ జరిగింది. కొన్ని రోజులుగా ఉన్న రిథమ్​ కలిసొచ్చింది. కోచ్​, కెప్టెన్ సూచనలతో నాలోని ధైర్యం మరింత పెరిగింది. వార్నర్​, బెయిర్​స్టో క్లాస్​ ఆటగాళ్లు. ఒకసారి వాళ్లు ఫామ్​లోకి వచ్చాక ఔట్​ చేయడం చాలా కష్టం. అదృష్టవశాత్తు వారిలో ఒకరిని ఔట్​ చేశా. అక్కడి నుంచి బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు."

- కమిన్స్​, కోల్​కతా నైట్​రైడర్స్ బౌలర్​

అబుదాబి వేదికగా కోల్​కతా నైట్​రైడర్స్​తో జరిగిన మ్యాచ్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​ ఓడిపోయింది. 143 పరుగుల లక్ష్యాన్ని 18 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది కోల్​కతా. శుభమన్​ గిల్​(70 ) అర్థశతకంతో అదరగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడికే మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​ అవార్డు దక్కింది.

కోల్​కతా బ్యాటింగ్​లో ఇయాన్​ మోర్గాన్​(42) నితిశ్​ రానా(26) మెరిశారు. సన్​రైజర్స్​ బౌలర్లలో నటరాజన్​, రషీద్​ ఖాన్,​ ఖలీల్ అహ్మద్​ చెరో వికెట్​ తీశారు. మిగిలిన వారు తేలిపోయారు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో బోణీ కొట్టింది కోల్​కతా. కాగా.. సన్​రైజర్స్​కు ఇది వరుసగా రెండో ఓటమి.

ABOUT THE AUTHOR

...view details