చివరి మూడు ఓవర్లలో హైదరాబాద్ బౌలింగ్‌పై ఎటాక్ చేయడమే తమ ప్రణాళిక అని రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ రాహుల్ తెవాతియా చెప్పాడు. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై ఐదు వికెట్ల తేడాతో రాజస్థాన్ జట్టు గెలిచింది.
రాహుల్ తెవాతియా-రియాన్ పరాగ్ 159 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్ తడబడింది. పవర్ ప్లేలో మూడు వికెట్లు కోల్పోయింది. ఉతప్ప(18), సంజూ శాంసన్(26)వెంట వెంటనే ఔటయ్యారు. అనంతరం క్రీజులోకి వచ్చిన రియాన్ పరాగ్(26 బంతుల్లో 42)-తెవాతియా(28 బంతుల్లో 45) జోడీ.. 85 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి, హైదరాబాద్ నుంచి మ్యాచ్ లాగేసుకుంది.
రాజస్థాన్ ఆల్‌రౌండర్ రాహుల్ తెవాతియా
"మేం మ్యాచ్ గెలిపించడానికి వీలైనంతగా ప్రయత్నించి, సాధించాం. చివరి మూడు ఓవర్లలో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడటమే మా ప్లాన్. మా టాప్ ఆర్డర్ చాలా బలమైంది. కానీ గత రెండు-మూడు మ్యాచ్‌ల్లో వారు సరిగ్గా ఆడలేకపోయారు. ఒకవేళ వారు ఔటైతే, అనుకున్న ప్రణాళికను మేం అమలు చేయాలని నిర్ణయించుకున్నాం" -రాహుల్ తెవాతియా, రాజస్థాన్ ఆల్‌రౌండర్
ఇదే మ్యాచ్‌తో ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన స్టార్ ఆల్‌రౌండర్ స్టోక్స్.. ఓపెనర్‌గా వచ్చి 5 పరుగులే చేసి నిరాశపరిచాడు. ఆరు పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్న రాజస్థాన్.. అక్టోబరు 14న జరిగే తర్వాతి మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.
రాజస్థాన్ ఆల్‌రౌండర్ స్టోక్స్