తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ముంబయి అందుకే విజయపథంలో దూసుకెళ్తోంది'

రెండేళ్ల క్రితం తమ జట్టు బౌలర్​ రషీద్​ ఖాన్​ను ట్రేడిండ్​ ద్వారా పొందటానికి ముంబయి ఇండియన్స్​ ఫ్రాంచైజీ ప్రయత్నించిందని తెలిపాడు సన్​రైజర్స్​ హైదరాబాద్​ మాజీ కోచ్​ టామ్ మూడీ. ఇతర జట్ల ఆటగాళ్లను ఈ పద్ధతి ద్వారా కొనుగోలు చేసే ధైర్యం ముంబయికి మాత్రమే ఉందన్నాడు. అందుకే విజయవంతమైన జట్టుగా నిలిచిందని ప్రశంసించాడు.

By

Published : Nov 11, 2020, 1:00 PM IST

Updated : Nov 11, 2020, 1:20 PM IST

IPL 2020: 'Mumbai Indians asked for a trade for Rashid Khan two years ago' - Former SRH coach Tom Moody
'ముంబయి అందుకే విజయపథంలో దూసుకెళ్తోంది'

సన్​రైజర్స్​ హైదరాబాద్​ మాజీ కోచ్​ టామ్​ మూడీ ఓ ఆసక్తికర సంఘటనను గుర్తుచేసుకున్నాడు. రెండేళ్ల క్రితం ముంబయి ఇండియన్స్​ ఫ్రాంచైజీ.. తమ జట్టు బౌలర్​ రషీద్​ ఖాన్​ను ట్రేడింగ్​ ద్వారా ​సొంతం చేసుకోవడానికి తమను సంప్రదించిందని అన్నాడు. ఐపీఎల్​లో ముంబయి.. విజయవంతమైన జట్టుగా ముందుకెళ్లడానికి గల కారణాన్ని వివరించాడు.

"నాకింకా బాగా గుర్తు.. రెండేళ్ల క్రితం ముంబయి ఇండియన్స్​ ఫ్రాంచైజీ రషీద్​ ఖాన్​ను ట్రేడ్​ చేయమని అడిగింది. రషీద్​ను ట్రేడ్ చేయమని అడగటానికి ఏ జట్టు ధైర్యం చేయలేదు. కానీ ముంబయి ఇండియన్స్ అలా ధైర్యం చేస్తుంది. అందుకే ముంబయి విజయపథంలో దూసుకెళ్తోంది."

-టామ్​ మూడీ, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్​.

మంగళవారం జరిగిన ఐపీఎల్ 13వ సీజన్ ఫైనల్లో దిల్లీ క్యాపిటల్స్​పై గెలిచి ఐదోసారి ట్రోఫీని చేజిక్కించుకుంది ముంబయి. లీగ్​లో అత్యంత విజయవంతమైన జట్టుగా మరోసారి నిరూపించుకుంది.

ఇదీ చూడండి ఐపీఎల్ 14వ సీజన్​లో కొత్త జట్టు.. మెగా వేలం!

Last Updated : Nov 11, 2020, 1:20 PM IST

ABOUT THE AUTHOR

...view details