తెలంగాణ

telangana

ETV Bharat / sports

సన్​రైజర్స్​పై ముంబయి ఇండియన్స్ విజయం - సన్​రైజర్స్ హైదరాబాద్ జట్ట

Both teams have four points from four games, but the Rohit Sharma-led MI are atop the table, courtesy a better net run rate.

IPL 2020: MI Won the toss and elected to bat first
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్​రైజర్స్

By

Published : Oct 4, 2020, 3:01 PM IST

Updated : Oct 4, 2020, 7:31 PM IST

19:25 October 04

ముంబయి ఇండియన్స్ విజయం

సన్​రైజర్స్​తో జరిగిన మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్ 34 రన్స్​ తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి నిర్ణీత ఓవర్లలో 208 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సారథి రోహిత్ శర్మ  6 పరుగులే చేసి ఔటయ్యాడు. కానీ డికాక్ 67 పరుగులతో సత్తాచాటాడు. సూర్య కుమార్ యాదవ్ (27), ఇషాన్ కిషన్ (31) కూడా పర్వాలేదనిపించారు. చివర్లో హార్డిక్ (28), పొలార్డ్ (25) మెరుపులు మెరిపించడం వల్ల భారీ స్కోర్ చేసింది ముంబయి.

209 పరుగుల భారీ లక్ష్య చేధన కోసం బరిలో దిగిన సన్​రైజర్స్  ఆది నుంచి దూకుడుగా ఆడింది. ముఖ్యంగా బెయిర్​స్టో (25) చెలరేగిపోయాడు. ఇతడి జోరు చూస్తే సన్​రైజర్స్ గెలుపు సులభమే అనిపించింది. కానీ అతడు ఔటయ్యాక కాస్త ఒత్తిడిలో పడింది హైదరాబాద్. కెప్టెన్ వార్నర్​ (60) కూడా అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కానీ అవసరమైన సమయంలో పెవిలియన్ చేరాడు. తర్వాత రన్​రేట్ క్రమంగా పెరగడం వల్ల పరాజయం పాలైంది సన్​రైజర్స్.

19:21 October 04

అభిషేక్ ఔట్

ఏడో వికెట్ కోల్పోయింది సన్​రైజర్స్. 10 పరుగులు చేసి వెనుదిరిగాడు అభిషేక్ వర్మ. హైదరాబాద్ గెలవాలంటే ఇంకా 7 బంతుల్లో 37 పరుగులు చేయాల్సి ఉంది.

19:17 October 04

సమద్ ఔట్

ఆరో వికెట్ కోల్పోయింది సన్​రైజర్స్. 20 పరుగులు చేసి వెనుదిరిగాడు అబ్దుల్ సమద్. ప్రస్తుతం 18.2 ఓవర్లకు 168 పరుగులు చేసింది హైదరాబాద్. గెలవాలంటే ఇంకా 10 బంతుల్లో 41 పరుగులు చేయాల్సి ఉంది.

19:10 October 04

17 ఓవర్లకు సన్​రైజర్స్ 158/5

17 ఓవర్లకు 158 పరుగులు చేసింది సన్​రైజర్స్. అభిషేక్ వర్మ (7), అబ్దుల్ సమద్ (13) క్రీజులో ఉన్నారు. ఇంకా మూడు ఓవర్లలో 51 పరుగులు చేయాల్సి ఉంది.

18:59 October 04

వార్నర్ ఔట్

ఐదో వికెట్ కోల్పోయింది సన్​రైజర్స్. 60 పరుగులు చేసి కెప్టెన్స్ ఇన్నింగ్స్ ఆడిన వార్నర్ ఔటయ్యాడు. ఇషాన్ కిషన్ అద్భుత క్యాచ్​తో వార్నర్ ఇన్నింగ్స్ ముగిసింది.

18:49 October 04

ప్రియమ్ గార్గ్ ఔట్

నాలుగో వికెట్ కోల్పోయింది సన్​రైజర్స్. 8 పరుగులకే పెవిలియన్ చేరాడు ప్రియమ్ గార్గ్. ప్రస్తుతం హైదరాబాద్ 14 ఓవర్లకు 130 పరుగులు చేసింది.

18:37 October 04

విలియమ్సన్ ఔట్

మూడో వికెట్ కోల్పోయింది సన్​రైజర్స్. 3 పరుగులకే పెవిలియన్ చేరాడు విలియమ్సన్. ప్రస్తుతం హైదరాబాద్ 12.2 ఓవర్లకు 116 పరుగులు చేసింది.

18:27 October 04

సన్​రైజర్స్​ హైదరాబాద్​ రెండో వికెట్​ కోల్పోయింది. మనీశ్​ పాండే(30) ఔటయ్యాడు. 

18:17 October 04

9 ఓవర్లకు 86/1

సన్​రైజర్స్​ హైదరాబాద్​ దూకుడుగా ఆడుతోంది. 9 ఓవర్లకు వికెట్​ కోల్పోయి 86 పరుగులు చేసింది. క్రీజులో వార్నర్​(27), పాండే(29) ఉన్నారు. 

18:03 October 04

ఏడు ఓవర్లకు సన్​రైజర్స్ 59/1

ఏడు ఓవర్లకు వికెట్ నష్టానికి 59 పరుగులు చేసింది సన్​రైజర్స్. వార్నర్ (16), మనీశ్ పాండే (15) క్రీజులో ఉన్నారు.

17:51 October 04

తొలి వికెట్​గా వెనుదిరిగిన బెయిర్​ స్టో

తొలి వికెట్ కోల్పోయింది సన్​రైజర్స్. 25 పరుగులు చేసిన బెయిర్ స్టో భారీ షాట్ ఆడబోయి క్యాచ్ ఔట్​గా వెనుదిరిగాడు.

17:43 October 04

మూడు ఓవర్లకు సన్​రైజర్స్ 30/0

మూడు ఓవర్లకు 30 పరుగులు చేసింది సన్​రైజర్స్. వార్నర్ (3), బెయిర్​స్టో (24) క్రీజులో ఉన్నారు.

17:35 October 04

తొలి ఓవర్లో సన్​రైజర్స్ 8/0

209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్​రైజర్స్ తొలి ఓవర్లో 8 పరుగులు చేసింది. బెయిర్ స్టో (7), వార్నర్ (1) క్రీజులో ఉన్నారు.

17:12 October 04

సన్​రైజర్స్ లక్ష్యం 209

సన్​రైజర్స్​ హైదరాబాద్​తో జరుగుతోన్న మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్ బ్యాట్స్​మెన్ రెచ్చిపోయారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 208 పరుగులు చేసింది. సారథి రోహిత్ శర్మ  6 పరుగులే చేసి ఔటయ్యాడు. కానీ డికాక్ 67 పరుగులతో సత్తాచాటాడు. సూర్య కుమార్ యాదవ్ (27), ఇషాన్ కిషన్ (31) కూడా పర్వాలేదనిపించారు. చివర్లో హార్డిక్ (28), పొలార్డ్ (25) మెరుపులు మెరిపించడం వల్ల భారీ స్కోర్ చేసింది ముంబయి.

17:10 October 04

హార్దిక్ ఔట్

ఐదో వికెట్ కోల్పోయింది ముంబయి. 28 పరుగులు చేసి హార్దిక్ ఔటయ్యాడు.

16:57 October 04

18 ఓవర్లకు ముంబయి 174/4

ముంబయి ఇండియన్స్ దూకుడు కొనసాగుతోంది. 18 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. పొలార్డ్ (16), హార్దిక్ (23) క్రీజులో ఉన్నారు.

16:49 October 04

ముంబయి ఇండియన్స్​ నాలుగో వికెట్​ కోల్పోయింది. ఇషాన్​ కిషన్​(31) పరుగులు చేసి వెనుదిరిగాడు. ముంబయి ప్రస్తుతం.. 15 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. 

16:36 October 04

మూడో వికెట్ డౌన్

మూడో వికెట్ కోల్పోయింది ముంబయి ఇండియన్స్. 67 పరుగులు చేసి భారీ షాట్ ఆడబోయి పెవిలియన్ చేరాడు డికాక్.

16:31 October 04

13 ఓవర్లకు ముంబయి 126/2

13 ఓవర్లకు ముంబయి రెండు వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (23), డికాక్ (67) క్రీజులో ఉన్నారు.

16:17 October 04

తొమ్మిది ఓవర్లకు ముంబయి 83/2

తొమ్మిది ఓవర్లకు ముంబయి రెండు వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (8), డికాక్ (40) క్రీజులో ఉన్నారు.

15:58 October 04

సూర్య కుమార్ యాదవ్ ఔట్

రెండో వికెట్ కోల్పోయింది ముంబయి. 27 పరుగులు చేసిన సూర్య కుమార్ యాదవ్ భారీ షాట్ ఆడబోయి క్యాచ్ ఔట్​గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ముంబయి 5.5 ఓవర్లకు 48 పరుగులు చేసింది.

15:45 October 04

మూడు ఓవర్లకు ముంబయి 25/1

మూడు ఓవర్లకు ముంబయి వికెట్ నష్టానికి 25 పరుగులు చేసింది. సూర్య కుమార్ యాదవ్ (12), డికాక్ (6) క్రీజులో ఉన్నారు.

15:34 October 04

రోహిత్ ఔట్

తొలి వికెట్ కోల్పోయిన ముంబయి ఇండియన్స్. సారథి రోహిత్ శర్మ (6) కీపర్​ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

15:03 October 04

ముంబయి ఇండియన్స్ పాత జట్టుతోనే బరిలో దిగుతోంది. గాయపడ్డ భువనేశ్వర్ కుమార్ ఈ మ్యాచ్​కు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో సందీప్ శర్మను జట్టులోకి తీసుకుంది సన్​రైజర్స్. అలాగే ఖలీల్ అహ్మద్ స్థానంలో సిద్దార్థ్ కౌల్ జట్టులోకి వచ్చాడు.

జట్లు

సన్​రైజర్స్ హైదరాబాద్

డేవిడ్ వార్నర్ (హైదరాబాద్), బెయిర్ స్టో, మనీశ్ పాండే, కేన్ విలియమ్సన్, ప్రియమ్ గార్గ్, అభిషేక్ వర్మ, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, సిద్దార్థ్ కౌల్, టి.నటరాజన్

ముంబయి ఇండియన్స్

డికాక్, రోహిత్ శర్మ (కెప్టెన్), సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, జేమ్స్ ప్యాటిన్సన్, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా

14:45 October 04

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబయి

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్​రైజర్స్

మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ముంబయి ఇండియన్స్-సన్​రైజర్స్ హైదరాబాద్​ మధ్య షార్జా వేదికగా నేడు మ్యాచ్​ జరగనుంది. గత మ్యాచ్​లో పంజాబ్​పై గెలిచిన రోహిత్ బృందం దూకుడుగా ఉంది. చెన్నైపై బౌలర్లు ఆధిపత్యం చెలాయించిన వేళ.. వార్నర్ సేన మరోసారి అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. బౌండరీలు చిన్నగా ఉండే షార్జా మైదానంలో సత్తాచాటాలని ఇరుజట్లు ఇప్పటికే కసరత్తులు ప్రారంభించాయి.  

ఈ మ్యాచ్​లో మొదట టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ బ్యాటింగ్ ఎంచుకుంది.

Last Updated : Oct 4, 2020, 7:31 PM IST

ABOUT THE AUTHOR

...view details