ఉత్కంఠగా సాగిన ఐపీఎల్ 13 సీజన్ మొదటి మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌పై చెన్నై సూపర్‌కింగ్స్ విజయం సాధించింది. 163 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చెన్నై విజయంలో అంబటి రాయుడు(71), డుప్లెసిస్ (58) కీలక పాత్ర పోషించారు.
ముంబయి ఇండియన్స్‌పై చెన్నై సూపర్ విక్టరీ
23:21 September 19
చెన్నై విజయం..
22:32 September 19
రాయుడు అర్ధ శతకం
ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన చెన్నై సూపర్‌కింగ్స్ అనంతరం నిలకడగా ఆడుతోంది. క్రీజులో ఉన్న రాయుడు, డుప్లెసిస్ ముంబయి బౌలర్లను సమర్థమంతగా ఎదుర్కొని పరుగులు సాధిస్తున్నారు. ఈ క్రమంలో 33 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు రాయుడు. దీంతో 12 ఓవర్లు పూర్తయ్యేసరికి 88 పరుగులు చేసింది
21:51 September 19
వరుసగా రెండో వికెట్ కోల్పోయింది చెన్నై జట్టు. రెండో ఓవర్ ముగిసేసరికి మరో ఓపెనర్ మురళీ విజయ్ ఒక పరుగే చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం 2 ఓవర్లకు ఆరు పరుగులు చేశారు.
21:45 September 19
చెన్నై సూపర్‌కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. నాలుగు పరుగులు చేసిన ఓపెనర్ వాట్సన్.. బౌల్ట్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. తొలి ఓవర్ ముగిసేసరికి 5 పరుగులు చేసింది ధోనీసేన.
21:24 September 19
ముంబయి ఇండియన్స్ స్కోరు 162/9
చెన్నైతో జరుగుతున్న ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లో ముంబయి తన ఇన్నింగ్స్‌ను ముగించింది. 9 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. డికాక్ (33), సౌరభ్ తివారీ (42) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. మిగిలిన వారు నామమాత్రంగా పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో ఎంగిడి 3, జడేజా, దీపక్ చాహర్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
21:14 September 19
పొలార్డ్ ఔట్
ఏడో వికెట్‌గా కీరన్ పొలార్డ్ ఔటయ్యాడు. కేవలం 18 పరుగులే చేసి పెవలియన్ చేరుకున్నాడు. ప్రస్తుతం క్రీజులో రాహుల్ చాహర్, జేమ్స్ పాటిన్సన్ ఉన్నారు. 18.1 ఓవర్లలో 152 పరుగులు చేసింది ముంబయి ఇండియన్స్.
21:04 September 19
ఆరో వికెట్‌గా వెనుదిరిగిన కృనాల్
ముంబయి ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్య.. కేవలం 3 పరుగులే చేసి ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు.
20:54 September 19
హార్దిక్ పాండ్య పెవిలియన్‌కు
డుప్లెసిస్ పట్టిన అద్భుతమైన క్యాచ్ వల్ల యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య కేవలం 14 పరుగులే చేసి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం క్రీజులో కృనాల్ పాండ్య, పొలార్డ్ ఉన్నారు.
20:51 September 19
సౌరభ్ తివారీ ఔట్
29 పరుగులు చేసిన సౌరభ్ తివారీ.. నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం 14.1 ఓవర్లో 121 పరుగులు చేసింది ముంబయి.
20:33 September 19
మూడో వికెట్‌గా సూర్యకుమార్
ముంబయి ఇండియన్స్ మూడో వికెట్‌గా సూర్యకుమార్ యాదవ్ వెనుదిరిగాడు. 16 బంతుల్లో 17 పరుగులు చేసి దీపక్ చాహర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ప్రస్తుతం 11 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 92 పరుగులతో ఉంది రోహిత్‌సేన.
20:29 September 19
10 ఓవర్ల ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది ముంబయి ఇండియన్స్. క్రీజులో సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారీ ఉన్నారు.
20:05 September 19
ఓపెనర్లు ఇద్దరూ ఔట్..
ముంబయి ఓపెనర్లు ఇద్దరూ ఔటయ్యారు. తొలుత పీయూష్ చావ్లా ఓవర్లో రోహిత్ ఔటవ్వగా.. మరుసటి ఓవర్లోనే వెనుదిరిగాడు డికాక్(33). సౌరభ్ తివారీ, సూర్యకుమార్ యాదవ్ క్రీజులో ఉన్నారు.
20:02 September 19
తొలి వికెట్ కోల్పోయిన ముంబయి..
దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించిన ముంబయి తొలి వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. పీయూష్ చావ్లా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 5 ఓవర్లు ముగిసేసరికి 48 పరుగులు చేసింది ముంబయి ఇండియన్స్. డికాక్(33), సూర్యకుమార్ యాదవ్(1) పరుగులతో క్రీజులో ఉన్నారు.
19:33 September 19
తొలి ఓవర్ ధాటిగా ఆరంభించిన ముంబయి
టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించింది ముంబయి జట్టు. రోహిత్ శర్మ, డికాక్ ఓపెనర్లుగా మైదానంలో అడుగుపెట్టారు. తొలి ఓవర్ పూర్తయ్యేసరికి వికెట్లేమి నష్టపోకుండా 12 పరుగులు చేశారు.
19:01 September 19
బౌలింగ్ ఎంచుకున్న ధోనీసేన
టాస్ గెలిచిన ధోనీ.. బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేయనుంది ముంబయి ఇండియన్స్.
జట్లు
చెన్నై సూపర్‌కింగ్స్: మురళీ విజయ్, షేన్ వాట్సన్, డుప్లెసిస్, అంబటి రాయుడు, కేదార్ జాదవ్, ధోనీ(కెప్టెన్), రవీంద్ర జడేజా, సామ్ కరన్, దీపక్ చాహర్, పియూష్ చావ్లా, లుంగి ఎంగిడి
ముంబయి ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), డికాక్, సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారీ, కృనాల్ పాండ్య, హార్దిక్ పాండ్య, పొలార్డ్, జేమ్స్ పాటిన్సన్, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా
18:33 September 19
స్టేడియానికి చేరుకున్న చెన్నై, ముంబయి జట్ల క్రికెటర్లు
అబుదాబి వేదికగా ఐపీఎల్ తొలి మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. చెన్నై-ముంబయి జట్లు హోరాహోరీగా తలపడేందుకు రెడీ అయ్యాయి. మరికాసేపట్లో టాస్ వేయనున్నారు.