వరుస ఓటములతో ఢీలాపడి, టోర్నీ నుంచి దాదాపుగా తప్పుకున్న చెన్నై సూపర్‌కింగ్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో నేడు తలపడనుంది. ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్లో ఘోరంగా ఆడుతున్న ధోనీసేన.. 11 మ్యాచ్‌ల్లో ఎనిమిదింట్లో ఓడి, పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనైనా గెలుస్తుందా? లేదా? అనేది చూడాలి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభంకానుంది.
కుర్రాళ్లకు అవకాశం
సీనియర్ల నిలకడలేని ప్రదర్శనలతో మ్యాచ్‌లు ఓడిపోతున్నప్పటికీ ధోనీ తీరు మార్చుకోవట్లేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం ముంబయితో మ్యాచ్‌కు యువ ఆటగాళ్లు రుతురాజ్, జగదీషన్లకు అవకాశమిచ్చాడు. కానీ ఖాతా తెరవకుండానే వారు ఔటయ్యారు. అయినా సరే మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ కుర్రాళ్లకు అవకాశాలు ఇస్తామని ధోనీ చెప్పాడు.
కరన్ ఒక్కడే
ఈ సీజన్లో చెన్నైకి ఏదైనా మంచి జరిగింది అంటే అది సామ్ కరన్ ఒక్కడే. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో అద్భుత ప్రతిభ కనబరుస్తున్న ఇతడు.. రానున్న మ్యాచ్‌లు, వచ్చే సీజన్లో చెన్నైకి కీలకం అవుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఎలా ఆడుతాడో చూడాలి. కరన్‌తో పాటే ఇతర సీఎస్కే ఆటగాళ్లు కూడా రాణించాల్సిన అవసరముంది. అప్పుడే కాస్త పరువైనా నిలుపుకొంటుందీ జట్టు.
దూకుడుగా బెంగళూరు