దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. 15 పరుగుల తేడాతో గెలుపొందింది. దిల్లీ జట్టులో శిఖర్ ధావన్ (34), రిషబ్ పంత్ (28), హెట్మియర్ (21) పర్వాలేదనిపించారు. అయినా మిగతా బ్యాట్స్‌మన్ విఫలమవడం వల్ల ఓటమిపాలయ్యారు. సన్‌రైజర్స్ బౌలర్లలో రషీద్ ఖాన్ 14 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసి సత్తాచాటాడు. భువనేశ్వర్ 2, ఖలీల్ అహ్మద్, నటరాజన్ చెరో ఒక వికెట్ దక్కించుకున్నారు. ఫలితంగా సమష్టిగా రాణించిన సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో బోణీ కొట్టింది.
మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్‌కు వార్నర్ (45), బెయిర్‌స్టో (53) అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ఈ లీగ్‌లో తొలి మ్యాచ్ ఆడిన విలియమ్సన్ 41 పరుగులతో సత్తాచాటాడు. దిల్లీ బౌలర్లలో రబాడ, అమిత్ మిశ్రా చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.