తెలంగాణ

telangana

ETV Bharat / sports

సన్​రైజర్స్​పై కోల్​కతా విజయం - కోల్‌కతా vs హైదరాబాద్ మ్యాచ్ టుడే

IPL 2020, KKR vs SRH Live
కోల్​కతా హైదరాబాద్​ ఐపీఎల్ మ్యాచ్

By

Published : Sep 26, 2020, 6:48 PM IST

Updated : Sep 26, 2020, 11:08 PM IST

22:55 September 26

సన్​రైజర్స్​ హైదరాబాద్​పై కోల్​కతా నైట్​ రైడర్స్​ ఏడు వికెట్లు తేడాతో విజయం సాధించింది. 143 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన కోల్​కతా 18 ఓవర్లలోనే లక్ష్యాని ఛేదించింది.  శుభమన్​ గిల్​(70 ) అర్థశతకంతో మెరవగా.. నితిశ్​ రైనా(26), మోర్గాన్​(42) పర్వాలేదనిపించారు. బౌలర్లలో కమిన్స్, వరుణ్ చక్రవర్తి, రసెల్ తలో వికెట్​ తీశారు.

22:50 September 26

కోల్​కతా నైట్​రైడర్స్ లక్ష్యానికి చేరువవుతోంది. 16 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. క్రీజులో శుభ్​మన్ గిల్, మోర్గాన్ ఉన్నారు.

22:12 September 26

కోల్​కతా కెప్టెన్ దినేశ్ కార్తిక్.. రషీద్ ఖాన్ బౌలింగ్​లో డకౌటై మూడో వికెట్​గా వెనుదిరిగాడు. ప్రస్తుతం 7 ఓవర్లు పూర్తయ్యేసరికి 55 పరుగులు చేసింది. క్రీజులో శుభ్​మన్ గిల్, మోర్గాన్ ఉన్నారు.

22:04 September 26

ఆరు ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది కోల్​కతా నైట్​రైడర్స్. క్రీజులో శుభ్​మన్, దినేశ్​ కార్తిక్ ఉన్నారు. ఖలీల్ అహ్మద్, నటరాజన్​ తలో వికెట్ తీశారు.

21:39 September 26

ఛేదనలో కోల్​కత్​కు ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ సునీల్ నరైన్.. రెండు బంతులు ఎదుర్కొని డకౌట్​గా వెనుదిరిగాడు. ప్రస్తుతం 1.2 ఓవర్లలో 6 పరుగులు చేసిందీ జట్టు.

21:15 September 26

సన్​రైజర్స్ హైదరాబాద్​ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. మనీశ్ పాండే(51) అర్థ శతకం చేయగా, వార్నర్(36), సాహా(30) పర్వాలేదనిపించారు. కోల్​కతా బౌలర్లలో కమిన్స్, వరుణ్ చక్రవర్తి, రసెల్ తలో వికెట్​ తీశారు.

20:57 September 26

హైదరాబాద్​ బ్యాట్స్​మెన్ సాహా- మనీశ్ పాండే అదరగొడుతున్నారు. కోల్​కతా బౌలింగ్​ను ఎదుర్కొని స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే మనీశ్ పాండే అర్థ శతకం చేశాడు. ప్రస్తుతం 17 ఓవర్లకు రెండు వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది సన్​రైజర్స్.

20:19 September 26

సన్​రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్.. 36 పరుగులు చేసిన చక్రవర్తి బౌలింగ్​లో ఔటయ్యాడు. ప్రస్తుతం 9.1 ఓవర్లలో 59 పరుగులు చేసింది హైదరాబాద్​ జట్టు.

20:15 September 26

9 ఓవర్లకు 59/1

సన్​రైజర్స్​ హైదరాబాద్​ నిలకడగా బ్యాటింగ్​ చేస్తోంది. ప్రస్తుతం 9 ఓవర్లకు వికెట్​ నష్టపోయి 59 పరుగులు చేసింది. వార్నర్​(35), మనీశ్​ పాండే(18) పరుగులతో క్రీజులో ఉన్నారు.

19:49 September 26

తొలి వికెట్​ డౌన్​...

సన్​రైజర్స్​ హైదరాబాద్​ తొలి వికెట్​ కోల్పోయింది. 5 పరుగులు చేసి పెవిలియన్​ చేరాడు బెయిర్​స్టో. సన్​రైజర్స్​ ప్రస్తుతం 4 ఓవర్లకు 24 పరుగులు చేసింది. వార్నర్​ 19 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 

19:41 September 26

టాస్ గెలిచిన హైదరాబాద్​ బ్యాటింగ్ మొదలుపెట్టింది. ఓపెనర్లు వార్నర్, బెయిర్ స్టో నిదానంగా ఆడుతున్నారు. మూడు ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్లేమి నష్టపోకుండా 22 పరుగులు చేసింది.

19:00 September 26

టాస్ గెలిచిన సన్​రైజర్స్ హైదరాబాద్​ కెప్టెన్ వార్నర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కోల్​కతా నైట్​రైడర్స్ బౌలింగ్ చేయనుంది. ఇప్పటికే తొలి మ్యాచ్​ల్లో ఓడిన ఇరుజట్లు.. గెలుపే లక్ష్యంగా తలపడనున్నాయి.

జట్లు

హైదరాబాద్

వార్నర్(కెప్టెన్), బెయిర్​స్టో, మనీశ్ పాండే, ప్రియమ్ గార్గ్, మహ్మద్ నబీ, సాహా, అభిషేక్ శర్మ, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, నటరాజన్

కోల్​కతా

సునీల్ నరైన్, శుభ్​మన్ గిల్, దినేశ్ కార్తిక్(కెప్టెన్), నితీశ్ రానా, మోర్గాన్, ఆండ్రూ రసెల్, కమిన్స్, కమలేశ్ నాగర్​కోటి, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, శివమ్ మావి

18:39 September 26

గెలిచేది ఎవరు?

అబుదాబి వేదికగా కోల్​కతా నైట్​రైడర్స్, సన్​రైజర్స్ హైదరాబాద్​ మధ్య నేడు ఐపీఎల్ మ్యాచ్​ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటికే తొలి మ్యాచ్​ల్లో ఓడిన ఇరుజట్లు.. ఎలాగైనా సరే ఈరోజు గెలవాలనే పట్టుదలతో ఉన్నాయి. హైదరాబాద్​ తరఫున మిచెల్ మార్ష్ స్థానంలో జేసన్ హోల్డర్ బరిలో దిగే అవకాశముంది.

Last Updated : Sep 26, 2020, 11:08 PM IST

ABOUT THE AUTHOR

...view details