తొడ కండరాల గాయం వల్ల చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌కు దూరమైన ముంబయి ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ.. నేడు (ఆదివారం) రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లోనూ బరిలో దిగే అవకాశాలు లేవని తెలుస్తోంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం.
తగ్గని గాయం.. నేటి మ్యాచ్‌కూ రోహిత్ దూరం! - రోహిత్ దూరం
నేడు (ఆదివారం) రాజస్థాన్ రాయల్స్‌తో జరగబోయే మ్యాచ్‌కు ముంబయి సారథి రోహిత్ శర్మ అందుబాటులో ఉండడని సమాచారం. గత ఆదివారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో తగిలిన గాయం తీవ్రత ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం.
రోహిత్
అయితే వచ్చే బుధవారం అబుదాబి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్‌లో రోహిత్‌ను ఆడించాలని యాజమాన్యం భావిస్తోంది. అప్పటివరకు రోహిత్‌కు 10 రోజుల విశ్రాంతి లభిస్తుంది. అందువల్ల నేడు రాజస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కు సారథిగా పొలార్డ్ కొనసాగే అవకాశం ఉంది.
ఇదీ చూడండి ఆ రికార్డు సాధించిన ఏకైన ఆటగాడిగా కోహ్లీ
Last Updated : Oct 25, 2020, 6:08 PM IST