సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు మిచెల్ మార్ష్ ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. బెంగళూరుతో మ్యాచ్‌లో అతడి చీలమండకు గాయమైందని, దీంతో లీగ్ మొత్తానికి దూరమయ్యాడని ఫ్రాంచైజీ అధికారిక ప్రకటన చేసింది. అతడి స్థానంలో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్‌ను తీసుకోనున్నట్లు ట్వీట్ చేసింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్: మార్ష్ స్థానంలో హోల్డర్ - మిచెల్ మార్ష్ న్యూస్
సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోకి కొత్త ఆల్‌రౌండర్ వచ్చాడు. గాయపడిన మిచెల్ మార్ష్‌కు బదులుగా వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్‌ను తీసుకున్నారు.
మిచెల్
సోమవారం మ్యాచ్‌లో ఇన్నింగ్స్ ఐదో ఓవర్ వేసిన మార్ష్.. రెండో బంతికి అరోన్ ఫించ్ డ్రైవ్‌ను అడ్డుకునే క్రమంలో గాయపడాడు. ప్రస్తుతం నొప్పి ఎక్కువ కావడం వల్ల విశ్రాంతి తీసుకుంటున్నాడు.
Last Updated : Sep 25, 2020, 6:00 PM IST