శ్రేయస్ అయ్యర్ (65*, 50 బంతుల్లో, 6×4, 2×6), పంత్ (56; 38 బంతుల్లో) అర్ధశతాకలతో అదరగొట్టిన వేళ ముంబయికి దిల్లీ 157 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. దిల్లీకి పేలవ ఆరంభం లభించింది. బౌల్ట్ ధాటికి 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్, శ్రేయస్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు. తొలుత నిదానంగా ఆడిన ఈ జోడీ తర్వాత బౌండరీల మోత మోగించింది. ఈ క్రమంలో పంత్ 35 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. అనంతరం భారీ షాట్‌కు యత్నించి పంత్ పెవిలియన్‌కు చేరాడు. దీంతో శ్రేయస్-పంత్ 96 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది.
ఐపీఎల్ ఫైనల్: ముంబయి ఇండియన్స్ లక్ష్యం 157 - MI vs DC final match 2020
ముంబయి ఇండియన్స్‌తో జరుగుతోన్న ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన దిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 156 పరుగులు చేసింది. పంత్ (56), శ్రేయస్ (65) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు.
ముంబయి
అనంతరం క్రీజులోకి వచ్చిన హెట్‌మెయర్ (5) ఎక్కువసేపు నిలవలేదు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ అడపాదడపా బౌండరీలు సాధిస్తూ స్కోరు బోర్డు ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో అతడు 41 బంతుల్లో హఫ్‌సెంచరీ అందుకున్నాడు. ఆఖర్లో అక్షర్ పటేల్ (9)తో కలిసి శ్రేయస్ బ్యాట్ ఝుళిపించడం వల్ల దిల్లీ 150 పరుగులు దాటింది. ముంబయి బౌలర్లలో బౌల్ట్ మూడు, కౌల్టర్‌నైల్ రెండు, జయంత్ ఒక వికెట్ తీశారు.
Last Updated : Nov 10, 2020, 9:27 PM IST