తెలంగాణ

telangana

ETV Bharat / sports

జోష్​తో చెన్నై.. స్టార్స్ లేకుండా రాజస్థాన్ - iol 2020

షార్జా వేదికగా చెన్నై-రాజస్థాన్ జట్ల మధ్య నేడు(సెప్టెంబరు 22) మ్యాచ్​ జరగనుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7.30 గంటలకు​ ప్రారంభం కానుంది.

Royals
రాజస్థాన్​ రాయల్స్​

By

Published : Sep 22, 2020, 5:25 AM IST

Updated : Sep 25, 2020, 6:00 PM IST

ఐపీఎల్ ప్రారంభ సీజన్​లో అండర్​డాగ్స్​గా బరిలోకి దిగి టైటిల్ విజేతగా నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించింది రాజస్థాన్ రాయల్స్. ఆ తర్వాత నిలకడలేమితో ప్రతి సీజన్​లోనూ నిరూత్సాహపర్చింది. 2013, 2015, 2018 ప్లేఆఫ్స్​కు చేరిన ఈ జట్టు.. గతేడాది దిగువ నుంచి రెండో స్థానంలో సరిపెట్టుకుంది. ఈ సీజన్​లో ఎలాగైనా ట్రోఫీని సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో వేలంపాటలో కొత్త కుర్రాళ్లను తీసుకుంది. మొత్తంగా యువకులు, అనుభవజ్ఞులతో జట్టు సమతూకంగా ఉండేలా చూసుకుంది. తమ తొలి మ్యాచ్​ను మంగళవారం (సెప్టెంబరు 22) చెన్నై సూపర్​కింగ్స్​తో ఆడనుంది. ఇప్పటికే ముంబయిపై గెలిచి ఫుల్​జోష్​లో ఉంది ధోనీసేన. ఈ నేపథ్యంలో ఇరుజట్ల బలాలు, బలహీనతలుపై విశ్లేషణ.

స్టార్స్​ లేకుండానే బరిలో రాజస్థాన్​

రాజస్థాన్‌ బలం ఆ జట్టు టాప్ ఆర్డర్. మ్యాచ్‌ ఫలితాలను ఒంటిచేత్తో తారుమారు చేయగల కెప్టెన్‌ స్మిత్‌తో పాటు బట్లర్‌, స్టోక్స్‌, మిల్లర్‌ లాంటి విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. అయితే ప్రస్తుత సీజన్​ కోసం కీలక ఆటగాళ్లు ఆ జట్టు నుంచి వరుసగా దూరమవుతూ ఉన్నారు. ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్ జోస్‌ బట్లర్‌ వ్యక్తిగత కారణాలతో దూరమవగా, ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ ఆడటంపై ఇంతవరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అసలు జట్టులో చేరతాడో లేదో యాజమాన్యానికే తెలియని పరిస్థితి.

దీంతోపాటు కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ కూడా కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నాడని సమాచారం. ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో గాయపడటమే ఇందుకు కారణంగా తెలుస్తుంది. తర్వాత అన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండే అవకాశాలున్నాయట. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న ఈ ముగ్గురు దూరం కావడం జట్టుకు కాస్త ఇబ్బందికర విషయమే.

మరోవైపు శాంసన్‌ రూపంలో ప్రతిభావంతుడైన ఆటగాడున్నాడు. ఈ ఏడాది అండర్‌-19 ప్రపంచకప్‌తో వెలుగులోకి వచ్చిన కుర్రాళ్లు.. యశస్వి జైస్వాల్, పేసర్‌ కార్తిక్‌ త్యాగిలతో పాటు గత సీజన్‌లో ఆకట్టుకున్న రియాన్‌ పరాగ్‌పై మంచి అంచనాలున్నాయి. రంజీల్లో అదరగొట్టిన పేసర్‌ జయదేవ్‌ ఉనద్కత్‌తో పాటు ఆర్చర్‌, థామస్‌లతో పేస్‌ విభాగం పటిష్ఠంగా కనిపిస్తోంది.

జోష్​తో ఉన్న చెన్నై

చెన్నై విషయానికొస్తే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తొలి మ్యాచ్​లో ముంబయిపై గెలిచి ఫుల్​ జోష్​లో ఉంది. ఇందులో తాము గెలిచినప్పటికీ కొన్ని లోపాలను ఉన్నాయని ధోనీ తెలిపాడు. వాటిని సరిదిద్దుకుని రాజస్థాన్​​తో పోరుకు బరిలో దిగుతామని చెప్పాడు.

జట్లు (అంచనా)

చెన్నై సూపర్ కింగ్స్:

ధోనీ (కెప్టెన్), మురళీ విజయ్, అంబటి రాయుడు, డుప్లెసిస్, షేన్ వాట్సన్, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, లుంగీ ఎంగిడి, దీపక్ చాహర్, పియూష్ చావ్లా, సామ్ కరన్

రాజస్థాన్ రాయల్స్:

రాబిన్ ఉతప్ప, సంజు శాంసన్, జోఫ్రా ఆర్చర్, యశస్వి జైస్వాల్, కార్తిక్ త్యాగి, ఆకాష్ సింగ్, డేవిడ్ మిల్లర్, టామ్ కరన్, శ్రేయాస్ గోపాల్, రియాన్ పరాగ్, వరుణ్ ఆరోన్

ఇదీ చూడండి ప్లాన్ లేకుండానే పంత్​ను ఔట్ చేశా: రవి బిష్ణోయ్

Last Updated : Sep 25, 2020, 6:00 PM IST

ABOUT THE AUTHOR

...view details