తెలంగాణ

telangana

ETV Bharat / sports

రైనాతో చెన్నై సూపర్​కింగ్స్​ బంధం కట్! - RAINA HARBHAJAN

సీనియర్ ఆటగాళ్లు రైనా, హర్భజన్​తో ఒప్పందాలు రద్దు చేసే యోచనలో ఉంది చెన్నై సూపర్​కింగ్స్. నిబంధనల ప్రకారమే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

IPL 2020: CSK to end contracts with Harbhajan Singh, Suresh Raina, says report
రైనాతో చెన్నై సూపర్​కింగ్స్​ బంధం కట్!

By

Published : Oct 2, 2020, 11:11 AM IST

Updated : Oct 2, 2020, 11:21 AM IST

చెన్నై ఫ్రాంచైజీతో సురేశ్‌ రైనా, హర్భజన్‌ సింగ్‌ అనుబంధానికి శాశ్వతంగా తెరపడినట్టే కనిపిస్తోంది. వారిద్దరు ఇకపై ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఇప్పటికే తమ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి వారిద్దరి పేర్లను తొలగించిన ఆ ఫ్రాంచైజీ.. వారితో ఒప్పందాలనూ రద్దు చేసుకొనే ప్రక్రియను ఆరంభించిందని సమాచారం. నిబంధనల ప్రకారమే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు లీగ్‌ వర్గాలు అంటున్నాయి.

2018 వేలం మార్గదర్శకాల ప్రకారం రైనా, భజ్జీతో చెన్నై మూడేళ్ల కాలానికి ఒప్పందాలు చేసుకుంది. ఈ ప్రకారం 2020 సీజన్‌తో ఒప్పంద గడువు ముగుస్తుంది. వ్యక్తిగత కారణాలతో వారిద్దరూ ఈ ఏడాది లీగ్‌ ఆడేందుకు నిరాకరించారు. దాంతో నిబంధనల ప్రకారం అధికారికంగా వారితో ఒప్పందాలు రద్దు చేసుకొనేందుకు యాజమాన్యం ప్రక్రియ మొదలుపెట్టిందని తెలిసింది. ఏడాదికి రూ.11 కోట్లకు రైనా, రూ.2 కోట్లకు భజ్జీతో చెన్నై ఒప్పందాలు చేసుకుంది. ఈ సీజన్‌లో ఆడటం లేదు కాబట్టి అందులో కొంత డబ్బునూ చెల్లించడం లేదని లేదని వినికిడి.

చెపాక్‌లో శిబిరం ఏర్పాటు చేసిన రైనా.. అక్కడికి వచ్చి సాధన చేశాడు. దుబాయ్‌లోనూ కొన్నాళ్లు జట్టుతో ఉన్నాడు. ఆ రోజులకు సంబంధించిన వేతనాలనూ ఫ్రాంచైజీ చెల్లడించడం లేదట! మ్యాచులు ఆడితేనే డబ్బులు ఇవ్వాలని నిబంధన పెట్టుకున్నట్టు తెలిసింది. ఏదేమైనప్పటికీ నవంబర్‌ 10తో ఈ సీజన్‌ ముగుస్తుంది. మళ్లీ 2021, ఏప్రిల్‌లోనే 14వ సీజన్‌ ఆరంభం కానుంది. అప్పుడూ లీగ్‌కు భారత్‌ ఆతిథ్యం ఇస్తుందో లేదో తెలియదు. కరోనా ముప్ప నేపథ్యంలో బీసీసీఐ ఆటగాళ్ల కోసం వేలం నిర్వహిస్తుందో లేదో స్పష్టత లేదు. ఈ ప్రకారం చూసుకుంటే వచ్చే ఏడాదీ రైనా, భజ్జీని మైదానంలో చూడటం కష్టమే!

Last Updated : Oct 2, 2020, 11:21 AM IST

ABOUT THE AUTHOR

...view details