తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఈసారి ఐపీఎల్​ వ్యూయర్​షిప్ టాప్ లేచిపోద్ది! - బ్రిజేశ్​ పటేల్​

ఐపీఎల్ ప్రారంభానికి ముందు మాట్లాడిన లీగ్​ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్.. ఈసారి వ్యూయర్​షిప్ చాలా ఎక్కువగా వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రేక్షకులను అనుమతి లేకపోవడం వల్ల అందరూ లైవ్ చూస్తారని పేర్కొన్నారు.

IPL 2020
బ్రిజేశ్​ పటేల్

By

Published : Sep 19, 2020, 5:48 PM IST

Updated : Sep 25, 2020, 5:59 PM IST

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్.. లీగ్​​ చరిత్రలోనే అత్యధిక వీక్షణలు సంపాదిస్తుందని అభిప్రాయపడ్డారు టోర్నీ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్. ముంబయి-చెన్నై మ్యాచ్​కు ముందు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఐపీఎల్​కు ఆతిథ్యమివ్వడంలో ఎదురయ్యే సవాళ్ల గురించి వెల్లడించారు.

"అడ్డంకులన్నీ దాటుకుని ఎట్టకేలకు ఐపీఎల్ జరుగుతుండటం చాలా సంతోషంగా ఉంది. ఈ సుదీర్ఘ టోర్నీలో ఇది ప్రారంభం మాత్రమే. లీగ్ తొలుత వాయిదా పడినప్పుడు అభిమానులు కాస్త నిరాశ చెందారు. ఇప్పుడు స్టేడియంలో ఎవరికీ అనుమతి లేనుందున.. అందరూ టీవీల్లో లైవ్​ చూస్తారు. కాబట్టి ఈసారి వ్యూయర్​షిప్ ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నాను"

బ్రిజేశ్​ పటేల్​, ఐపీఎల్​ ఛైర్మన్​

యూఏఈలో ఐపీఎల్​ జరిగేలా కృషిచేసిన బీసీసీఐ, లీగ్​ అధికారులు, భారత ప్రభుత్వానికి పటేల్​ కృతజ్ఞతలు తెలిపారు. టోర్నీ నిర్వహణ విషయంలో ఎమిరేట్స్​ క్రికెట్ బోర్డు తమకు చాలా మద్దతునిచ్చిందని పేర్కొన్నారు.

సెప్టెంబరు 19న భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ఐపీఎల్​ ప్రారంభ మ్యాచ్​ జరగనుంది. చెన్నై, ముంబయి జట్లు తలపడనున్నాయి. 53 రోజుల పాటు సాగే లీగ్​కు.. దుబాయ్​, అబుదాబి, షార్జా స్టేడియాలు వేదికలు.

Last Updated : Sep 25, 2020, 5:59 PM IST

ABOUT THE AUTHOR

...view details