రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ ఐపీఎల్లో అడుగుపెట్టనున్నాడు. ఆదివారం యూఏఈ చేరాక కొవిడ్ టెస్టు చేయించుకుంటాడని.. ఆ తర్వాత వెంటనే ఆరు రోజుల పాటు నిర్బంధంలో ఉంటాడని రాజస్థాన్ జట్టుకు చెందిన ఓ అధికారి వెల్లడించారు. అక్టోబరు 11న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌తో స్టోక్స్ అందుబాటులోకి వస్తాడని తెలిపారు.
"స్టోక్స్ హోటల్‌కు చేరుకున్న వెంటనే తన నిర్బంధాన్ని ప్రారంభిస్తాడు. ఈరోజే అతడికి మొదటి కొవిడ్ టెస్టు చేస్తారు. స్టోక్స్ 6 రోజుల నిర్బంధం పూర్తయ్యే రోజునే(అక్టోబరు 9) దిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ ఉంటుంది. అయినా అతడిని అక్టోబరు 11న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌తో తుదిజట్టులో ఆడించాలని భావిస్తున్నాం. ఎందుకంటే స్టోక్స్ కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్నందున తిరిగి గాడిలోకి రావడానికి హైదరాబాద్‌తో మ్యాచ్‌కు ముందు ప్రాకీస్టు ఉపయోగపడుతుంది."