రాయల్ ఛాలెంజర్ బెంగళూరు ఓపెనర్ దేవదత్ పడిక్కల్‌కు క్రికెట్లో మంచి భవిష్యత్ ఉంటుందని అభిప్రాయపడ్డాడు కామెంటేటర్ ఆకాశ్ చోప్రా. ఈ ఏడాది ఐపీఎల్లో అతడి ఆటకు తాను ముగ్ధుడయ్యాడని చెప్పాడు. అభిమానుల అంచనాలను తారుమారు చేసేలా.. ఆర్సీబీలో కోహ్లీ, ఏబీ డివిలియర్స్, అరోన్ ఫించ్ లాంటి స్టార్ ఆటగాళ్లను మించి బాగా ఆడాడని కొనియాడాడు. క్రీడాభిమానులు ఈ ముగ్గురు గురించి మాట్లాడుకోవడం మానేసి తన గురించి చెప్పుకునేంత గొప్ప ప్రదర్శన చేశాడని కితాబిచ్చాడు. దీంతోపాటే ఆర్సీబీ ఆటగాళ్లలో ఫించ్ పేలవమైన ప్రదర్శనతో అభిమానులను నిరాశపరిచేలా ఆడాడని అన్నాడు.
'పడిక్కల్.. కోహ్లీ, డివిలియర్స్‌ను మించిపోయాడు' - padikkal impressed akash chopra
ఈ ఐపీఎల్లో బెంగళూరు జట్టు ఓపెనర్ దేవదత్ పడిక్కల్ ఆటతీరుకు తాను ముగ్ధుడయ్యాడని చెప్పాడు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా. క్రికెట్లో అతడికి మంచి భవిష్యత్ ఉంటుందని అన్నాడు.
పడిక్కల్
పడిక్కల్.. ఈ ఐపీఎల్లో 124.80స్ట్రైక్ రేట్‌తో 473పరుగులు చేశాడు. ఐదు అర్ధ శతకాలు బాదాడు. తన అద్భుతమైన ఆటతో అందరీ దృష్టిని ఆకర్షించాడు. మ్యాచ్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
ఇదీ చూడండి : అడిలైడ్ టూ సిడ్నీ: కరోనా నేపథ్యంలో ఆటగాళ్ల తరలింపు!