గాయం కారణంగా ప్రస్తుత ఐపీఎల్ సీజన్ నుంచి తప్పుకున్నాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ భువనేశ్వర్ కుమార్. టోర్నీ చరిత్రలో రెండు సార్లు అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా పర్పుల్ క్యాప్ విజేతగా నిలిచాడు. ఇప్పుడు ఇతడి లోటుతో సర్‌రైజర్స్ బౌలింగ్ విభాగానికి పెద్ద దెబ్బని చెప్పాలి. ఇటీవలే చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో తొడ కండరం పట్టేయడం వల్ల అర్ధాంతరంగా మ్యాచ్ నుంచి నిష్క్రమించాడు. తాజాగా చేసిన పరీక్షల్లో గాయం మరింత తీవ్రమవ్వడం వల్ల టోర్నీ నుంచే శాశ్వతంగా తప్పుకున్నట్లు ఎస్ఆర్హెచ్ యాజమాన్యం స్పష్టం చేసింది.
జట్టుకు ప్రధాన బలమైన పేసర్ భువీ దూరమవ్వడం వల్ల యాజమాన్యం మరో బౌలర్ కోసం ఆసక్తి చూపకపోవచ్చు. ఇప్పటికే సన్‌రైజర్స్‌లో ఎక్కువమంది బౌలర్లు ఉన్నారు. మిడిల్ ఆర్డర్లో బ్యాట్స్‌మన్‌ను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో భువనేశ్వర్ స్థానాన్ని భర్తీ చేయగల ముగ్గురు ఆటగాళ్లను పరిశీలిద్దాం.
3) యూసఫ్ పఠాన్
గత రెండు ఐపీఎల్ సీజన్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించాడు యూసఫ్ పఠాన్. ప్రస్తుత సీజన్లో యువ ఆల్‌రౌండర్లు జట్టులో ఉన్నప్పటికీ అనుభవజ్ఞుడైన యూసఫ్‌ను యాజమాన్యం ఎంపిక చేసుకునే అవకాశం ఉంది.
ఇటీవలే షార్జా వేదికగా ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ జట్టు బ్యాటింగ్‌లో రాణించలేక పోయింది. ఈ కారణంగా హిట్టర్‌గా పేరొందిన యూసఫ్ పఠాన్‌ను కీలకమైన బ్యాటింగ్ స్థానాల్లో బరిలో దించవచ్చు. అవసరమైతే స్పిన్ బౌలింగ్ కూడా వేయగలడు.
యూసఫ్ పఠాన్.. ఐపీఎల్ కెరీర్లో 154 ఇన్నింగ్స్‌ల్లో 142.97 స్ట్రైక్ రేట్‌తో 3,204 పరుగులు చేశాడు. ప్రస్తుత సీజన్ వేలంలో యూసఫ్‌ను ఏ జట్టూ సొంతం చేసుకోలేదు.