తెలంగాణ

telangana

ETV Bharat / sports

'నేను రిటైర్​ అవ్వడం వారికి ఇష్టం లేదు' - chris gayle on manideep singh

జట్టులోని యువ ఆటగాళ్లు తనను రిటైర్​ కావొద్దని కోరుతున్నారని క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్​ తెలిపాడు. సోమవారం జరిగిన మ్యాచ్​లో కింగ్స్​ ఎలెవన్ పంజాబ్​ జట్టు, కోల్​కతాపై విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరింది. మ్యాచ్​ అనంతరం క్రిస్​ గేల్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.

Youngsters in team keep telling me, 'don't retire', says Gayle
నేను రిటైర్​ అవ్వటం వారికి ఇష్టంలేదు'

By

Published : Oct 27, 2020, 11:55 AM IST

సోమవారం కోల్​కతా నైట్​రైడర్స్​తో జరిగిన మ్యాచ్​లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్​ జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మ్యాచ్​ అనంతరం పంజాబ్​ ఆటగాడు క్రిస్​ గేల్​ మాట్లాడుతూ తన రిటైర్మెంట్​పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టులోని యువ ఆటగాళ్లు తనను టీ20 ఫార్మాట్​ నుంచి రిటైర్ కావొద్దని కోరుతున్నారని తెలిపాడు.

"నాకు మా జట్టుపై పూర్తి నమ్మకం ఉంది. మాకు ఇద్దరు అత్యుత్తమ స్పిన్నర్లు ఉన్నారు. పరిస్థితులను బట్టి స్పిన్నర్లను మార్చాల్సి ఉంటుంది. మన్​దీప్ సింగ్ అద్భుతంగా ఆడుతున్నాడు. జట్టులోని యువ ఆటగాళ్లు నన్ను టీ20 ఫార్మాట్​ నుంచి రిటైర్ కావొద్దని కోరుతున్నారు"

-క్రిస్​ గేల్​, పంజాబ్​ జట్టు

సోమవారం జరిగిన మ్యాచ్​లో కోల్​కతా నిర్దేశించిన 150పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది పంజాబ్​ జట్టు. మన్​దీప్​ సింగ్​(66), క్రిస్ గేల్​(51) అద్భుత ప్రదర్శన కనబర్చారు.

ABOUT THE AUTHOR

...view details