ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ రాకతో తమ జట్టు బౌలింగ్ దళం మరింత బలపడిందన్నాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ. బలమైన జట్టుపై అద్భుత విజయం సాధించామని చెప్పాడు. సోమవారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో గెలిచిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌లో మోరిస్ రెండు వికెట్లు పడగొట్టాడు.
ఏబీ డివిలియర్స్నూ ప్రశంసించాడు కోహ్లీ. మిగతా బ్యాట్స్‌మెన్ తడబడిన షార్జా పిచ్ పై అతడు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడని కొనియాడాడు. ఏబీ విజృంభించడం వల్లే 20ఓవర్లలో తమ జట్టు 194 పరుగులు చేయగలిగిందని అన్నాడు. తర్వాతి మ్యాచ్‌ల్లోనూ మరింత బాగా ఆడతామని ధీమా వ్యక్తం చేశాడు.