ఆసీస్ దిగ్గజ క్రికెటర్ డీన్ జోన్స్ ఆకస్మిక మృతికి సంతాపంగా బెంగళూరు-పంజాబ్ క్రికెటర్లు నివాళి అర్పించనున్నారు. దుబాయ్ వేదికగా గురువారం జరిగే మ్యాచ్‌లో చేతికి నల్లని బ్యాండ్లు కట్టుకోనున్నారు. ఈ విషయాన్ని ఐపీఎల్ పాలకమండలి అధికారి వెల్లడించారు.
బెంగళూరు-పంజాబ్ మ్యాచ్‌లో డీన్ జోన్స్‌కు నివాళి - RCB vs KXIP LIVE
బెంగళూరు-పంజాబ్ మ్యాచ్‌లో డీన్ జోన్స్‌కు నివాళిగా క్రికెటర్లందరూ చేతికి నల్లబ్యాండ్లు ధరించనున్నారు. ఈ విషయాన్ని ఐపీఎల్ పాలకమండలి అధికారి చెప్పారు.
బెంగళూరు-పంజాబ్ మ్యాచ్
ఐపీఎల్ వ్యాఖ్యాతగా ఉన్న డీన్.. ముంబయిలో ప్రస్తుతం ఓ హోటల్లో ఉండి పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే గుండెపోటు రావడం వల్ల తుదిశ్వాస విడిచారు. ఈయన్ను స్వస్థలానికి చేర్చే విషయమై ఆస్ట్రేలియా హై కమీషన్‌తో స్టార్ ఇండియా చర్చలు జరుపుతోంది.
ఈయన మృతికి సంతాపం తెలుపుతూ ఇప్పటికే సచిన్, సెహ్వాగ్, కోహ్లీ, రవిశాస్త్రితో పాటు పలువురు సంతాపం తెలిపుతున్నారు. డీన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
Last Updated : Sep 25, 2020, 6:00 PM IST