అబుదాబి వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ముంబయి ఇండియన్స్ గెలుపొందింది. ముంబయి బ్యాట్స్‌మన్ క్వింటన్ డికాక్ 78 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో అలరించిన డికాక్.. తన ప్రాక్టీస్ ప్యాంట్ వేసుకుని బ్యాటింగ్ చేశాడు. ఈ విషయాన్ని మ్యాచ్ అనంతరం అతడే వెల్లడించాడు. అయితే దీనివల్ల మార్కెటింగ్ టీమ్‌తో ఇబ్బందులు తలెత్తే కారణంగా మరోసారి అలా చేయొద్దని కోచ్ జయవర్ధనే.. డికాక్‌కు సూచించాడు.
రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్ "డికాక్ తన ప్రాక్టీస్ ప్యాంట్‌తో బ్యాటింగ్ చేయడం తప్ప మ్యాచ్‌లో మిగితావన్నీ సక్రమంగా జరిగాయి. దీనివల్ల మార్కెటింగ్ విభాగానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. మరోసారి ఇలా చేయొద్దని అతడికి సూచించా."
- జయవర్ధనే, ముంబయి ఇండియన్స్ కోచ్
ఈ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ మరోసారి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తుగా ఓడించి ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 149 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముంబయి 16.5 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. విజయంలో డికాక్(78), రోహిత్(35) కీలక పాత్ర పోషించారు. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ పర్వాలేదనిపించారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. ముంబయి బౌలర్ల ధాటికి కోల్‌కతా బ్యాట్స్‌మెన్ విలవిలలాడారు. టోర్నీలో వరుసగా ఐదో విజయంతో 12 పాయింట్లను ముంబయి ఇండియన్స్ తన ఖాతాలో వేసుకుని అగ్రస్థానానికి చేరింది.