రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌తో దిల్లీ క్యాపిటల్స్ పేసర్ రబాడా అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ టోపీని దక్కించుకున్నాడు. మరోవైపు పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆరెంజ్ క్యాప్‌తో కొనసాగుతున్నాడు.
ఐపీఎల్: పర్పుల్, ఆరెంజ్ క్యాప్ అప్డేట్ - IPL purple cap
ఈ ఏడాది ఐపీఎల్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టి రబాడా(12) పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు. కేఎల్ రాహుల్ ఆరెంజ్ టోపీతో కొనసాగుతున్నాడు.
ఈ లీగ్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో రాహుల్ ఒక సెంచరీ, రెండు అర్ధసెంచరీలు చేసి 302 పరుగులు సాధించి తొలి స్థానంలో నిలిచాడు. రాహుల్ తర్వాత చెన్నై బ్యాట్స్‌మన్ డుప్లెసిస్(282),పంజాబ్ ఆటగాడు మయాంక్ అగర్వాల్(272) రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు.
బౌలర్ల జాబితాలో 12 వికెట్లు తీసి రబాడా పర్పుల్ టోపీని దక్కించుకున్నాడు. యుజ్వేంద్ర చాహల్(8), బౌల్ట్(8) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు. లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన వారికి ఆరెంజ్ క్యాప్, అత్యధిక వికెట్లు తీసిన వారికి పర్పుల్ టోపీలను అందజేస్తారు.