తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​ 13: ఏఏ ఓవర్లో ఆటగాళ్లు ఎలా ఆడారంటే?

ఐపీఎల్​ 13వ సీజన్ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. ఉత్కంఠ పోరులతో ఫ్యాన్స్​కు మజా అందిస్తోంది. అయితే సెప్టెంబరు 27 వరకు జరిగిన ఎనిమిది మ్యాచుల్లోని 20వ ఓవర్లో ఆటగాళ్ల గణాంకాలపై ఓ లుక్కేద్దాం.

IPL 13
ఐపీఎల్​ 13

By

Published : Sep 28, 2020, 10:57 AM IST

టీ20ల్లో 20వ ఓవర్​​ ఎంతో ముఖ్యమైంది. ప్రధానంగా బ్యాట్స్​మెన్​కు ఈ ఓవర్​ అత్యంత ముఖ్యం. ఎందుకంటే ఇందులో అతడు సాధించే స్కోరుపై జట్టు గెలుపు, ఓటమి ఆధారపడి ఉంటుంది. అనేకసార్లు ఈ ఓవర్​తోనే అంచనాలు తలకిందులైన సందర్భాలు చాలానే ఉన్నాయి.

అయితే ప్రస్తుతం ఐపీఎల్​ 13వ సీజన్​లో ఇప్పటివరకు జరిగిన తొలి ఎనిమిది మ్యాచుల్లో 20వ ఓవర్​లో ఆటగాళ్ల గణాంకాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.

20వ ఓవర్లోనే ఎక్కువ

మొత్తంగా 78బంతుల్లో(20వ ఓవర్లో) 14.54 సగటుతో 189 పరుగులు చేశారు బ్యాట్స్​మెన్​. ఇప్పటివరకు జరిగిన ఎనిమిది మ్యాచుల్లో ఈ ఓవర్లోనే అత్యధిక పరుగులు చేశారు. ఇక పద్దెనిమిదో ఓవర్లో 11.80 , 17వ ఓవర్లో 10.44, 19ఓవర్లో 9.14 సగటుతో మాత్రమే పరుగులు చేశారు.

చాలా తక్కువగా

తొలి రెండు ఓవర్లు, 11వ ఓవర్​ విషయానికొస్తే చాలా తక్కువ పరుగులు​ తీశారు బ్యాట్స్​మెన్. రెండో ఓవర్లో 5.25 సగటుతో 84పరుగులు మాత్రమే చేశారు. తొలి ఓవర్​లో 5.31, 11 ఓవర్లో 6.31 సగటుతో రన్స్​ సాధించారు.

16,20 ఓవర్లోనే ఎక్కువ

బౌలర్ల విషయానికొస్తే 16, 20ఓవర్లలో ఎక్కువ వికెట్లను పడగొట్టారు. ఇప్పటివరకు జరిగిన మ్యాచుల్లో ఈ రెండు ఓవర్లలో 11వికెట్లు చొప్పున తీశారు బౌలర్లు. అయితే తొలి, ఎనిమిది, పదమూడు ఓవర్లలో మాత్రం తక్కువ వికెట్లు తీశారు. తొలి ఓవర్లో చాలా తక్కువగా 2 వికెట్లు తీయగా.. రెండో ఓవర్లో మాత్రం ఏకంగా ఆరు వికెట్లు తీసి అదరగొట్టారు.

ఇదీ చూడండి చెన్నై ట్విట్టర్​ను రైనా అన్​ఫాలో చేశాడా?

ABOUT THE AUTHOR

...view details