తమ బ్యాట్స్మెన్ వైఫల్యమే మ్యాచ్ ఓటములకు కారణమని చెన్నైకెప్టెన్ ధోనీ వివరణ ఇచ్చాడు. అందుకే బెంగళూరు చేతిలో మళ్లీ ఓడిపోయామని అన్నాడు. బ్యాట్స్మెన్ సరిగ్గా ఆడుంటే ఫలితం వేరుగా ఉండేదని తెలిపాడు.
"చివరి నాలుగు ఓవర్లలో బౌలింగ్ ఇంకాస్త జాగ్రత్తగా వేస్తే సరిపోతుంది. కానీ బ్యాటింగ్లో మాత్రం చాలా లోపాలు ఉన్నాయి. ఈ మ్యాచ్ ఓటమికి కారణం అదే. ముఖ్యంలో ఆరో ఓవర్ నుంచి మా బ్యాటింగ్ లైన్అప్లో బలం లేదు. వాటిని సరిదిద్దుకోవడానికి ఏదో ఒకటి చేయలి. తర్వాతి ఆడబోయే మ్యాచుల్లో బాగా ఆడటానికి ప్రయత్నిస్తాం.