తెలంగాణ

telangana

ETV Bharat / sports

రోహిత్ శర్మను అందుకే ఎంపిక చేయలేదా?

భారత జట్టు ఫిజియో నితిన్ పటేల్ రిపోర్ట్ వల్లే రోహిత్​ను ఆస్ట్రేలియా టూర్​కు ఎంపిక చేయలేదని, కోలుకుంటే జట్టులోకి వచ్చే అవకాశముందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

India team physio wants 2-3 weeks rest for Rohit Sharma
'రోహిత్​కు మూడు వారాల విశ్రాంతి అవసరం.. కానీ!'

By

Published : Oct 28, 2020, 6:31 PM IST

ఆస్ట్రేలియా పర్యటనకు ఓపెనర్ రోహిత్ శర్మ​ అందుబాటులో ఉండడని టీమ్​ఇండియా ఫిజియో నితిన్​ పటేల్ సెలెక్టర్లకు​ చెప్పాడు. ఇందువల్లే అతడిని ఎంపిక చేయనట్లు తెలుస్తోంది. ఇటీవలే జట్టును ప్రకటించిన బీసీసీఐ.. గాయాలపాలైన రోహిత్​, ఇషాంత్​.. వైద్యబృందం పర్యవేక్షణలో ఉన్నారని పేర్కొంది.

జట్టును ప్రకటించిన కొన్ని గంటలకే నెట్స్​లో ప్రాక్టీసు చేస్తున్న రోహిత్​ ఫొటోలను ముంబయి ఇండియన్స్​ ట్వీట్​ చేసింది. దీంతో బీసీసీఐతో పాటు సెలెక్టర్లు ఆశ్చర్యపోయారు. ఒకవేళ ఆసీస్ టూర్​లో అవకాశం కోసం కొన్ని ఐపీఎల్​ మ్యాచ్​లకు హిట్​మ్యాన్​ దూరం కావాల్సి ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఫిజియో నితిన్​ పటేల్​ బీసీసీఐకి ఇచ్చిన నివేదిక ప్రకారం రోహిత్ శర్మకు మరో మూడువారాల విశ్రాంతి అవసరమని సూచించాడు. ఆ వివరాలను సునీల్​ జోషి నేతృత్వంలోని సెలెక్షన్​ ప్యానెల్​కు సమర్పించాడు. అందుకు అనుగుణంగానే ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్​ను ఎంపిక చేయలేదని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.

"ప్రతి ఆటగాడి ఫిట్​నెస్​ నివేదికను నితిన్​ పటేల్,​ మాకు సమర్పించాడు. ఎంపిక ప్రక్రియలో అది భాగమే. జట్టుకు ఏ ఆటగాడు సరిపోతాడనే విషయాన్ని అతడు తెలియజేస్తాడు. గాయం కారణంగా రోహిత్​ అందుబాటులో ఉండడని సెలెక్టర్లకు సమాచారం ఇచ్చాడు. జట్టుకు చెందిన ఇద్దరు వైద్యులు, రోహిత్​కు రెండు నుంచి మూడు వారాల విశ్రాంతి అవసరమని సూచించారు"

-బీసీసీఐ అధికారి

రోహిత్​శర్మ నెట్స్​లో బ్యాటింగ్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు వైరల్​గా మారడం వల్ల బీసీసీఐపై విమర్శలు మొదలయ్యాయి. రోహిత్​కు ఎలాంటి గాయమైందో బహిరంగ చర్చ అవరసరమని దిగ్గజ ఆటగాడు సునీల్​ గావస్కర్​ అన్నాడు. హిట్​మ్యాన్​ బ్యాటింగ్​ చేస్తున్నట్లు తమ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని బీసీసీఐ, సెలెక్షన్​ కమిటీ అభిప్రాయపడింది. గాయం నుంచి రోహిత్​ కోలుకుంటే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే అవకాశముందని తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details