కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీకిది మరిపోదగ్గ ఐపీఎల్ సీజన్. అతడి సారథ్యంలో ఎన్నడూ లేని విధంగా ఘోరమైన ప్రదర్శన చేసింది చెన్నై. 11 మ్యాచ్‌ల్లో 9 పరాజయాలతో తొలిసారిగా ప్లేఆఫ్స్‌కు దూరం కావడమే కాదు. పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతోంది.
బ్యాట్స్‌మెన్‌గా ధోనీ పేలవ ప్రదర్శన చేశాడు. ఈ నేపథ్యంలో నామమాత్రమైన మిగతా మూడు మ్యాచ్‌లకు అతను దురంగా ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ధోనr అందుకు అవకాశమే లేదన్నాడు. కెప్టెన్‌గా తాను బాధ్యతల నుంచి పారిపోలేనన్నాడు.