యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్లో అందరికన్నా ముందు ముంబయి ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది. గురువారం జరిగిన తొలి క్వాలిఫయర్‌లోనూ విజయం సాధించి ఫైనల్లోనూ అడుగుపెట్టింది. ఐదోసారి టైటిల్‌పైనా కన్నేసింది. అయితే, ముందెన్నడూ ఇలా వరుసగా ముంబయి, రెండు సీజన్లలో ఫైనల్స్ చేరిన దాఖలాలు లేవు. లసిత్ మలింగ లాంటి స్టార్‌పేసర్ లేకపోయినా ఈసారి ఆ జట్టు విశేషంగా రాణించింది. అందుకు ప్రధాన కారణం జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్. వీరిద్దరూ లీగ్ దశలో ప్రత్యర్థులను హడలెత్తించగా, దిల్లీ మ్యాచ్‌లోనూ నిప్పులు చెరిగే బంతులేశారు. అలా బుమ్రా 4/14, బౌల్ట్ 2/9 మెరుగైన గణంకాలు నమోదు చేశారు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా పేసర్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. లీగ్ చరిత్రలో ఒక సీజన్‌లో అత్యధిక వికెట్లు 27 తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు.
కివీస్ పర్యటనలో విఫలమై..
గతేడాది వన్డే ప్రపంచకప్ తర్వాత లండన్‌లో వెన్నెముకకు సంబంధించి శస్త్రచికిత్స చేయించుకున్న బుమ్రా.. కొద్ది నెలలు ఆటకు దూరమయ్యాడు. బెంగళూరు జాతీయ శిక్షణ శిబిరంలో పాల్గొని పూర్తిగా ఫిట్‌నెస్ సాధించాడు. దాంతో న్యూజిలాండ్ పర్యటనకు ఎంపికైనా ఆశించినంత మేర రాణించలేకపోయాడు. తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక ఇబ్బందులు పడ్డాడు. మొత్తం 5 టీ20ల్లో 5 వికెట్లు, 2 టెస్టుల్లో 6 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఇక 3 వన్డేల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అయితే, గాయం నుంచి కోలుకొని అప్పుడే తిరిగి జట్టులో చేరడం వల్ల అతడిపై భారీ అంచనాలు పెట్టుకోవడం సబబు కాదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఈ సీజన్‌లో రెండుసార్లు..