కళ్లు చెదిరే సిక్సర్లతో షార్జాలో వరుసగా రెండో అర్ధశతకం బాదిన సంజూ శాంసన్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్దేశించిన 224 పరుగుల లక్ష్య ఛేదనలో అతడి బ్యాటింగ్‌ను అందరూ కీర్తిస్తున్నారు. రాజస్థాన్ సారథి స్టీవ్‌స్మిత్ నుంచి మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు ఈ యువ క్రికెటర్ బ్యాటింగ్‌కు ఫిదా అయ్యారు.
లీగ్ చరిత్రలోనే అత్యధిక లక్ష్యమైన 224 పరుగుల్ని రాజస్థాన్ ఛేదించిందంటే అది సంజూ వల్లే. అద్భుతంగా ఆడుతున్న అతడిని అందరూ ప్రశంసిస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా అతడిని అభినందించారు. భారత క్రికెట్లో తర్వాతి ధోనీ అవుతాడని అతడికి ఎప్పుడో చెప్పానని ట్వీట్ చేశారు.
"రాజస్థాన్‌కు ఇది తిరుగులేని విజయం. దశాబ్ద కాలంగా సంజూ శాంసన్ నాకు తెలుసు. ఏదో ఒకరోజు తర్వాతి ధోనీగా నువ్వు అవతరిస్తావని 14 ఏళ్లప్పుడే అతడికి చెప్పా. ఆ రోజు ఇప్పుడొచ్చింది. లీగ్‌లో రెండు అద్భుత అర్ధశతకాల తర్వాత ఓ ప్రపంచస్థాయి ఆటగాడు వచ్చాడని మీ అందరికీ తెలిసింది."