దుబాయ్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌పై 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఆ జట్టు విజయంలో రషీద్ ఖాన్ (4-0-7-3)కీలక పాత్ర పోషించాడు. తన నాలుగు ఓవర్లలో 17 డాట్‌బాల్స్‌తో బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు. పూర్తి అవగాహనతో బౌలింగ్‌లోకి దిగడమే తన బలమని చెబుతున్నాడు ఈ అఫ్గాన్ లెగ్ స్పిన్నర్.
"నేను స్పష్టమైన నిర్ణయం తీసుకుని బౌలింగ్‌కి దిగుతాను. అదే నా బలం. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నేను మంచి లైన్, లెంగ్త్‌లో బౌల్ చేస్తాను. బ్యాట్స్‌మెన్ బలాబలాలను పరిశీలిస్తాను. వాటిని దృష్టిలో ఉంచుకుని నేను ఆట కొనసాగిస్తాను. మ్యాచ్ గెలవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. డాట్ బాల్స్ సాయంతో వికెట్లు పడగొట్టగలిగాను."
-- రషీద్ ఖాన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు.
'ఆ పద్ధతిలో ఆడాం..'
సన్‌రైజర్స్ విజయంపై ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఆనందం వ్యక్తం చేశాడు. 2009 నాటి పద్ధతిని ఈ సారి అవలంబించానని చెప్పాడు.
"గత మ్యాచ్ ఓటమి మమ్మల్ని నిరాశకు గురి చేసింది. కానీ, ఈసారి నేను 2009 నాటి సంప్రదాయాన్ని పాటించాను. టాప్ ఆర్డర్ బాధ్యతను తీసుకున్నాను. ఈ పరిస్థితుల్లో సంప్రదాయ క్రికెట్ ఆడటం కష్టమే. అందుకే నేను నా బ్యాట్‌ను ఝుళింపించాను. "