ముంబయి ఇండియన్స్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడకపోవడంపై ఆ జట్టు కెప్టెన్ రోహిత్‌శర్మ స్పందించాడు. హార్దిక్‌కు ఫిట్నెస్ సమస్యలేవి లేవని.. మరికొంత మంది ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం కోసమే ఆల్‌రౌండర్‌కు విశ్రాంతి కల్పించామని మంగళవారం జరిగిన మ్యాచ్ అనంతర సమావేశంలో వెల్లడించాడు. ప్లే-ఆఫ్ మ్యాచ్‌లో పాండ్యా కచ్చితంగా ఆడతాడని హిట్‌మ్యాన్ తెలిపాడు.
"హార్దిక్ పాండ్యాకు ఫిట్నెస్ పరంగా ఎలాంటి సమస్య లేదు. సన్‌రైజర్స్ మ్యాచ్‌లో అతడికి విరామం ఇవ్వాలని మేము భావించాం. అతడి స్థానంలో మిగిలిన వాళ్లకి అవకాశం ఇవ్వాలని అనుకున్నాం. కానీ, ప్లేఆఫ్ మ్యాచ్‌కు హార్దిక్ సిద్ధంగా ఉంటాడు".