తెలంగాణ

telangana

ETV Bharat / sports

సన్​రైజర్స్​దే విజయం.. కారణాలు ఇవే! - హైదరాబాద్ vs ఆర్సీబీ ప్లే ఆఫ్ 2020

శుక్రవారం జరిగే క్వాలిఫయర్​లో సన్​రైజర్స్​కు గెలిచే అవకాశం ఎక్కువగా ఉందని క్రికెట్ విశ్లేషకుడు వెంకటేశ్ అభిప్రాయపడ్డారు. ఈటీవీ భారత్​తో మాట్లాడిన ఆయన.. పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

Hyderabad have a better chance of success over Bangalore
'సన్​రైజర్స్​కే విజయావకాశాలు ఎక్కువ'

By

Published : Nov 6, 2020, 3:58 PM IST

Updated : Nov 6, 2020, 6:13 PM IST

ఈటీవీ భారత్​తో వెంకటేష్

అబుదాబి వేదికగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరబాద్‌ జట్టుకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు వెంకటేశ్ తెలిపారు. గత మ్యాచ్‌లో చాంఫియన్ జట్టు ముంబయిపై పది వికెట్ల తేడాతో విజయం సాధించడం వల్ల జట్టు మంచి విశ్వాసంతో ఉందన్నారు. అదే జోరును ఆర్సీబీతో జరిగే పోరులోనూ ప్రదర్శిస్తుందన్నారు. సన్‌రైజర్స్‌ జట్టు అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉందని తెలిపారు. తొలుత హైదరాబాద్‌ బ్యాటింగ్‌ చేస్తే 180కి పైగా పరుగులు చేయాలంటున్న క్రికెట్‌ విశ్లేషకులు వెంకటేశ్​తో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి.

వరుసగా నాలుగు పరాజయాలతో లీగ్‌దశను ముగించిన ఆర్సీబీ కంటే చివరి మూడు మ్యాచ్‌లు నెగ్గి ముందంజ వేసిన సన్‌రైజర్స్ ఈ ఎలిమినేటర్‌ పోరులో ఫేవరేట్‌గా బరిలో దిగనుందంటారా?

వెంకటేశ్: నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయిన ఆర్సీబీ కొంత నిరుత్సాహంగానే ఉంటుంది. సన్‌ రైజర్స్ గత మూడు మ్యాచ్‌లు ప్లేఆఫ్‌లో ఉన్న ముంబయి, దిల్లీ, ఆర్సీబీ జట్ల మీదనే గెలిచింది. తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్‌ల్లో ఉత్కంఠభరతమెన క్షణాల మధ్య అధిక్యంలో ఉన్న జట్లను ఓడించింది. దీంతో ఆత్మవిశ్వాసం మెరుగ్గా ఉంటుంది. ఫామ్‌లో ఉన్నారు కాబట్టి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది.

చావోరేవో తేల్చుకోవాల్సిన గత మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌పై 10 వికెట్ల తేడాతో విజయం సాధించడం పట్ల ఆత్మవిశ్వాసం పెరిగిందంటారా... రాయల్‌ ఛాలెంజర్స్‌తో అదే జోరును ప్రదర్శించే అవకాశం ఉందా?

వెంకటేశ్: ముంబయి అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థి జట్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదు. క్వాలిఫయర్‌-1లో దిల్లీ టీంను చిత్తుచిత్తుగా ఓడించింది. అలాంటి ముంబయి జట్టు మీద పది వికెట్ల తేడాతో విజయం సాధించడం మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఈ విజయంతో నేడు జరిగే మ్యాచ్‌లో మరింతగా రాణించే అవకాశం ఉంది.

ఓపెనర్‌గా అదరగొడుతున్న సాహాతో పాటు కెప్టెన్‌ వార్నర్‌ గొప్ప ఫామ్‌లో ఉండడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశమే అంటారా?

వెంకటేశ్: వృద్ధిమాన్‌ సాహాను ఓపెనర్‌గా దించడం సన్‌రైజర్స్‌కు ఒక మలుపుగా భావించాలి. అతను ఆడిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ కూడా మంచి స్ర్టైక్‌ రేట్‌తో బ్యాటింగ్‌ చేయడం చూశాం. మిడిలార్డర్‌ సమస్య లేకపోవడం వల్ల వార్నర్‌ ఒత్తిడి లేకుండా ఆడుతున్నాడు. ప్రస్తుతం సన్‌రైజర్స్ జట్టు అన్ని ఫార్మాట్లలోను పటిష్ఠంగా ఉంది.

రెండు జట్ల బలాలు, బలహీనతలు ఏంటి? సన్‌ రైజర్స్‌ ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు ఎలాంటి వ్యూహాలు అవలంభించాలంటారు?

వెంకటేశ్: ఆర్సీబీ మిడిలార్డర్‌ బ్యాటింగ్‌ చెప్పుకోదగ్గదిగా లేదు. ఇది ఆర్సీబీ ప్రధాన బలహీనత. గత మ్యాచ్‌లో మోరిస్ గాయానికి గురయ్యాడు. అతడు ఫిట్​గా లేకపోతే కష్టంగానే ఉంటుంది. బౌలింగ్‌ విషయంలో సన్‌ రైజర్స్‌ అద్భుత ప్రదర్శన చేస్తోంది. గతంలో బ్యాటింగ్‌లో ఉన్న సమస్యను సన్‌రైజర్స్ అధిగమించింది.

టాస్‌ గెలిచిన జట్లు ఛేజింగ్‌నే ఎంచుకుంటున్నాయి.. ఎందుకంటారు? ఈ రోజు మ్యాచ్‌లో సన్‌ రైజర్స్‌ టాస్‌ గెలిస్తే తొలుత బ్యాటింగ్‌ ఎంచుకోవాలా, ఫీల్డింగ్‌నా?

వెంకటేశ్: టాస్‌ అనేది చాలా కీలకమైంది. సెకండ్‌ టైమ్‌ బౌలింగ్‌ అనేది జట్లకు కష్టంగా ఉంది. మంచు ప్రభావం వల్ల బంతిని గ్రిప్ చేయడం అనేది బౌలర్లకు కష్టసాధ్యమవుతుంది. అందుకే టాస్‌ గెలిచిన జట్లన్నీ ముందుగా ఫీల్డింగ్‌ ఎంచుకుని ఛేజింగ్ చేయడానికి ఇష్టపడుతున్నాయి. మొదట బ్యాటింగ్‌ చేసిన టీమ్ అధిక స్కోరు నమోదు చేస్తే విజయం సాధించే అవకాశం ఉంది. ఇది క్వాలిఫయర్‌-1లో ఉత్పన్నమైంది.

సన్‌రైజర్స్ జట్టు కెప్టెన్‌ వార్నర్‌ రాణించడంపై మీరేమంటారు?

వెంకటేశ్: వార్నర్‌ మొదట్లో చాలా నెమ్మదిగా ఆడాడు. సాహా ఓపెనర్​గా రావడం వల్ల ఒత్తిడి లేకుండా అద్భుతంగా ఆడుతున్నాడు. ప్రతి సీజన్‌లో వార్నర్‌ ఐదు వందల పరుగులు చేస్తున్నాడు. ఇది జట్టుకు కలిసొచ్చే అంశం

నటరాజన్‌ యార్కర్‌ బౌలింగ్‌ సన్‌ రైజర్స్‌ విజయానికి కలిసి వస్తోందంటారా?

వెంకటేశ్: డెత్‌ బౌలింగ్‌లో నటరాజన్‌ వేసినన్నీ యార్కర్స్ ఏ బౌలర్‌ కూడా వేయలేదు. తన నైపుణ్యంతో అద్భుత ఆట తీరును ప్రదర్శించాడు. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. వచ్చిన అవకాశాన్ని నటరాజన్‌ సద్వినియోగం చేసుకున్నాడు. డెత్‌ బౌలింగ్‌ విషయంలో నటరాజన్ ఉన్నాడు కాబట్టి సన్‌ రైజర్స్‌కు ఎలాంటి ఇబ్బంది లేదు.

పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమా.. బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుందంటారా?

వెంకటేశ్: యూఏఈలోని పిచ్‌లన్నీ స్లోడౌన్‌ అయిపోయాయి. స్పిన్నర్స్‌కి కలిసొచ్చే అంశంగా ఉన్నాయి. సన్‌రైజర్స్‌ జట్టు బౌలింగ్‌లో పటిష్ఠంగా ఉంది. వాళ్లు బంతిని స్వింగ్‌ చేయగలరు కాబట్టి సన్‌రైజర్స్‌కి కలిసి వస్తాయి.

ఈ మ్యాచ్‌లో సన్‌ రైజర్స్‌ గెలిస్తే ఎలిమినేటర్‌-2లో దిల్లీతో తలపడాలి. ఈ పోరులో సన్‌ రైజర్స్ గెలుస్తుందంటారా?

వెంకటేశ్: సన్‌ రైజర్స్‌ ఎలిమినేటర్‌లో గెలిస్తే ఎలిమినేటర్‌-2లో దిల్లీపైన విజయం సాధించడం పెద్ద కష్టమేమి కాదు. సులువుగా ఫైనల్‌కి చేరుతుంది.ో

Last Updated : Nov 6, 2020, 6:13 PM IST

ABOUT THE AUTHOR

...view details