తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​లో చోటు.. ఉద్వేగం ఆపుకోలేక ఏడ్చేసిన క్రికెటర్ - ipl 2020 news

కోల్​కతా జట్టులో చోటు దక్కించుకున్న అలీఖాన్.. ఐపీఎల్​లో ఆడుతున్న తొలి అమెరికా క్రికెటర్​గా రికార్డు సృష్టించాడు. తనకు లీగ్​లో అవకాశం వచ్చిందని తెలియగానే ఉద్వేగంతో ఏడ్చేశాడట.

How USA's Ali Khan got to the IPL
బౌలర్ అలీఖాన్

By

Published : Sep 23, 2020, 12:35 PM IST

Updated : Sep 25, 2020, 6:00 PM IST

ఐపీఎల్‌ అంటేనే ఛాంపియన్ల కలయిక. ప్రపంచంలోని అత్యుత్తమ జట్లలోని మేటి ఆటగాళ్లంతా ఇక్కడే కనిపిస్తారు. ఈ లీగ్​లో ఒక్క అవకాశం వస్తే బాగుండని ఆశపడని క్రికెటర్‌ ప్రపంచంలోనే ఉండరేమో! మరి క్రికెట్‌లో ఓనమాలు దిద్దుతున్న అమెరికాలాంటి దేశం నుంచి ఓ ఆటగాడు‌ ఈ టోర్నీకి ఎంపికకావడం అంటే మాటలా! నిజమే.. అమెరికాకు చెందిన అలీఖాన్‌ అంత సులువుగా ఏం ఎంపిక కాలేదు. ఎంతో శ్రమించి తన ఆటతీరుతో జట్టు యాజమాన్యాన్ని విశేషంగా ఆకట్టుకున్నాడు. చివరికీ జట్టులో చోటు సంపాదించాడు. ఇంతకీ ఎవరీ అలీఖాన్‌?

కోల్​కతా నైట్​రైడర్స్ బౌలర్ అలీఖాన్

పాకిస్థాన్‌లో పుట్టి.. అమెరికాకు ఆడి..

మహమ్మద్‌ అసన్‌ అలీఖాన్‌.. పుట్టింది పాకిస్థాన్‌లోని పంజాబ్‌. పెరిగింది అమెరికా. 2016 నుంచి అమెరికా జాతీయ క్రికెట్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇప్పటి వరకూ 36 టీ20లాడాడు. కుడి చేతివాటం గల ఈ క్రికెటర్‌.. 27.13 సగటుతో 38 వికెట్లు తీశాడు. 2019 ఏప్రిల్‌లో పపువా న్యూగినియా వన్డే జట్టులో స్థానం సంపాదించాడు. బంతిని వేగంగా వేయడం మాత్రమే కాదు.. బంతి బంతికీ వేరియేషన్స్‌ చూపించడంలో అలీఖాన్‌ దిట్ట.

కోల్​కతా బౌలర్ అలీఖాన్

సీపీఎల్‌ ప్రదర్శనతోనే..

అలీఖాన్‌ అగ్రశ్రేణి పేసర్లకు దీటుగా బంతులు సంధించగలడు. 2018లో జరిగిన కెనడా గ్లోబల్‌ టీ20 లీగ్‌లో విశేషంగా రాణించాడు. అత్యధిక వికెట్లు తీసి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో దృష్టిని ఆకర్షించాడు. అలా.. కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(సీపీఎల్‌)లో అడుగుపెట్టాడు. ఆ సంవత్సరం అమెజాన్‌ వారియర్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 12 మ్యాచుల్లోనే 16 వికెట్లు తీసి ఔరా అనిపించాడు. సీజన్‌లోనే రెండో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు. ఆ తర్వాత ఏడాది షారుక్‌ఖాన్‌ జట్టు ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ అలీఖాన్‌ను సొంతం చేసుకుంది. బంతికి మరింత పదును పెంచాడు. ఆడిన ఎనిమిది మ్యాచుల్లో 7.43 ఎకానమీతో 8 వికెట్లు సొంతం చేసుకున్నాడు. తన జట్టును టైటిల్‌ విజేతగా నిలుపడంలో తనవంతు పాత్ర పోషించాడు. అలా.. సీపీఎల్‌ ప్రదర్శనతో ఫ్రాంచైజీని విశేషంగా ఆకర్షించాడు. అతనికి అక్కడి నుంచే ఐపీఎల్‌కు బాటలు పడ్డాయి. కోల్‌కతా బౌలర్‌ హ్యారీ గర్నీ భుజం గాయంతో టోర్నీకి దూరం కావడం వల్ల యాజమాన్యం వెంటనే అలీఖాన్‌కు అవకాశం కల్పించింది.

Last Updated : Sep 25, 2020, 6:00 PM IST

ABOUT THE AUTHOR

...view details