తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కోహ్లీ మనలాంటి మనిషే.. యంత్రం కాదు'

గత మ్యాచ్​లో బెంగళూరు కెప్టెన్​ కోహ్లీ క్యాచ్​లు మిస్​ చేయడంపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై విరాట్​ చిన్ననాటి కోచ్​ స్పందిస్తూ.. రెండు మ్యాచ్​లు చూసి అతనిపై ఓ నిర్ణయానికి రావడం సరికాదని అన్నారు. ప్రతి ఆటగాడికి కెరీర్​లో ఇటువంటి పరిస్థితులు ఎదురవుతుంటాయని పేర్కొన్నారు.

Kohli
విరాట్​ కోహ్లీ

By

Published : Sep 28, 2020, 8:14 AM IST

కింగ్స్ ఎలెవన్ పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్​ విరాట్ కోహ్లీ రెండు విలువైన క్యాచ్​లు జారవిరచడంపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే కోహ్లీ చిన్ననాటి కోచ్​ రాజ్​కుమార్​ శర్మ స్పందించారు. కేవలం రెండు మ్యాచ్​లు చూసి అతడిపై ఓ నిర్ణయానికి రావడం సరికాదని అభిప్రాయపడ్డారు.

విరాట్​ కోహ్లీ

"ప్రతి ఒక్క ఆటగాడి జీవితంలో ఇది ఒక భాగం. మైదానంలో అందరికీ మంచిరోజులూ, చెడ్డరోజులూ ఉంటాయి. కోహ్లీ మనలాగే మాములు మనిషే.. యంత్రం కాదు. అతనిలో ఏమైనా నైపుణ్యం లోపించిందా అని కొంతమంది అడుగుతున్నారు. నేను మళ్లీ చెబుతున్నా.. ఓటమి ఆటలో ఒక భాగం. ప్రతి సారీ విజయం వరించాలంటే ఎప్పటికీ సాధ్యం కాదు. కోహ్లీ నిలకడగా ఆడటాన్ని అతడి అభిమానులు అలవాటు చేసుకున్నారు. కాబట్టి ఏ ఒక్క ఇన్నింగ్స్​లో సరిగా ఆడకపోయినా వారు నిరాశచెందుతారు."

-రాజ్​కుమార్​ శర్మ, కోహ్లీ చిన్ననాటి కోచ్​

గత మ్యాచ్​లో కోహ్లీ క్యాచ్​లను మిస్​ చేయడం వల్ల.. పంజాబ్​ కెప్టెన్​ కేఎల్​ రాహుల్​ విన్నింగ్​ సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే ఆరునెలలుగా పిచ్​కు దూరంగా ఉండటం వల్ల.. విరాట్​ అసహనానికి గురవుతున్నాడా అని అడగ్గా.. " ప్రతి ఒక్కరూ క్యాచ్​లు మిస్​ చేస్తారు. గతంలోనే అనేక మంది దిగ్గజ క్రికెటర్లు ఈ తప్పులు చేసినవారే. కాబట్టి లాక్​డౌన్​ ప్రభావం ఎంతమాత్రం లేదు. కోహ్లీ తిరిగి పుంజుకోవడానికి, జట్టును ముందుండి నడిపించడానికి బాగానే కష్టపడ్డాడు" అని రాజ్​కుమార్​ పేర్కొన్నారు.

విరాట్​ కోహ్లీ
కోచ్​ రాజ్​కుమార్​తో కోహ్లీ

ABOUT THE AUTHOR

...view details