తెలంగాణ

telangana

ETV Bharat / sports

'మా కష్టం ఫలించింది..అందుకే ప్లేఆఫ్స్​కు చేరాం' - ముంబయి ఇండియన్స్​ వార్తలు

ఐపీఎల్​ నాకౌట్​ దశకు చేరడం చాలా ఆనందాన్నిచ్చిందని ముంబయి ఇండియన్స్​ కెప్టెన్​ రోహిత్​శర్మ అన్నాడు. తాము చేసిన కృషి వల్లే టోర్నీలో ప్లేఆఫ్స్​కు చేరామని తెలిపాడు.

'Hardwork has paid off': Rohit Sharma as MI qualifies for playoffs
'మా కష్టం ఫలించింది.. ప్లేఆఫ్స్​కు చేరాం'

By

Published : Nov 1, 2020, 6:39 PM IST

ఐపీఎల్​ ప్లేఆఫ్స్​కు తమ జట్టు చేరడం చాలా సంతోషాన్నిచ్చిందని ముంబయి ఇండియన్స్​ కెప్టెన్​ రోహిత్​ శర్మ అన్నాడు. టీమ్​లోని ఆటగాళ్లు చేసిన కృషి వల్లే టోర్నీలో తాము నాకౌట్​ దశకు చేరామని ముంబయి ఇండియన్స్​ అధికారిక ట్విట్టర్​లో హిట్​మ్యాన్​ తెలిపాడు.

"ఐపీఎల్ ప్లేఆఫ్స్​కు మేము అర్హత సాధించాం. మా కృషి వల్లే ఇక్కడ వరకు వచ్చాం. టోర్నీలో ప్రస్తుతానికి ఓ గండాన్ని దాటాం. ఇక నాకౌట్​ దశపై దృష్టి సారించాలి. సన్​రైజర్స్​ హైదరాబాద్​తో మా జట్టుకు చివరి లీగ్ మ్యాచ్​ ఉంది. అది మరో ముఖ్యమైన పోరు అవుతుంది. ప్రత్యర్థి గురించి ఆలోచించడం ఇష్టం లేదు. నిజాయతీగా మా ప్రదర్శన చేయడానికే వచ్చాం."

- రోహిత్​శర్మ, ముంబయి ఇండియన్స్​ కెప్టెన్

ఐపీఎల్​ ప్రస్తుత సీజన్​లో ఇప్పటివరకు 13 మ్యాచ్​లు ఆడిన ముంబయి ఇండియన్స్​ 9 మ్యాచ్​ల్లో విజయం సాధించి 18 పాయింట్లను తమ ఖాతాలో వేసుకుంది. ఫలితంగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. దీంతో రోహిత్​సేన ఫైనల్​కు వెళ్లడానికి రెండు అవకాశాలున్నాయి. కాగా తన చివరి మ్యాచ్​లో షార్జా వేదికగా నవంబరు 3న సన్​రైజర్స్​ హైదరాబాద్​తో ముంబయి ఇండియన్స్​ తలపడనుంది. వార్నర్​సేన ప్లేఆఫ్స్​కు చేరాలంటే ఈ మ్యాచ్​ కచ్చితంగా గెలవాల్సిఉంటుంది.

కోలుకున్నాడు.. కానీ!

గాయం కారణంగా వైస్​కెప్టెన్​ రోహిత్​శర్మను ఆస్ట్రేలియా పర్యటనకు సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. కానీ, రోహిత్​ ఫిట్​నెస్​పై వైద్యబృందం ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తుందని భారత క్రికెట్​ నియంత్రణ మండలి (బీసీసీఐ) వెల్లడించింది. ఆసీస్​తో సిరీస్​ కోసం రోహిత్​ అందుబాటు గురించి ఓ బీసీసీఐ అధికారి మాట్లాడారు.

"ఆదివారం రోహిత్​శర్మను మరోసారి పర్యవేక్షిస్తారు. ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్​ అందుబాటులో ఉంటాడా? లేదా? అనే విషయంపై స్పష్టత వస్తుంది. గాయం నుంచి అతడు పూర్తిగా కోలుకున్నాడు. కానీ, హిట్​మ్యాన్​ మరికొంత విశ్రాంతి తీసుకోవాల్సి ఉంది" అని ఓ బీసీసీఐ అధికారి వెల్లడించారు.

ఐపీఎల్​ పూర్తయిన తర్వాత టీమ్​ఇండియా యూఏఈ నుంచి నేరుగా ఆస్ట్రేలియా బయలుదేరనుంది. దీనికోసం టెస్టు స్పెషలిస్టు చెతేశ్వర్​ పుజారా, హనుమ విహారి ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details