రాజస్థాన్ రాయల్స్‌పై విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన ముంబయి బ్యాట్స్‌మన్ హార్దిక్ పాండ్యా.. అర్ధ శతకం తర్వాత మోకాలిపై కూర్చొని.. పిడికిలి పైకెత్తి బ్లాక్ లైవ్స్ మ్యాటర్‌కు మద్దతు తెలిపాడు. దీంతో ఈ ఐపీఎల్లో 'బ్లాక్ లైవ్స్ మ్యాటర్'కు మద్దతు తెలిపిన తొలి ఆటగాడిగా పాండ్యా నిలిచాడు.
'బ్లాక్ లైవ్స్ మ్యాటర్'కు మద్దతుగా పాండ్యా - బ్లాక్ లైవ్స్ మ్యాటర్ హార్దిక్ పాండ్యా
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ ఆటగాడు హార్దిక్ పాండ్యా అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. తన అర్ధశతకం పూర్తయిన తర్వాత మోకాలిపై కూర్చొని 'బ్లాక్ లైవ్స్ మ్యాటర్'కు మద్దతు తెలిపాడు.
'బ్లాక్ లైవ్స్ మ్యాటర్'కు మద్దతు తెలిపిన పాండ్యా
ఈ మ్యాచ్‌లో కేవలం 21 బంతుల్లోనే పాండ్యా 60 పరుగులు చేశాడు. 19వ ఓవర్లో తన అర్ధ సెంచరీ పూర్తయిన తర్వాత మోకాలిపై కూర్చొని జాత్యహంకారానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి సంఘీభావం తెలిపాడు. పాండ్యా మద్దతుగా స్పందించిన వెస్టిండీస్ ఆటగాడు కీరన్ పొలార్డ్ అతడి కుడి పిడికిలిని పైకి లేపాడు. మ్యాచ్ తర్వతా తాను మోకాలిపై కూర్చొన్న ఫొటోను.. బ్లాక్ లైవ్స్ మాటర్ క్యాప్షన్‌తో పాండ్యా ట్వీట్ చేశాడు