ముంబయి ఇండియన్స్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం బౌలింగ్ చేసేంత ఫిట్‌గా లేడని ఆ జట్టు సారథి రోహిత్ శర్మ అన్నాడు. బౌలింగ్ చేస్తున్నప్పుడు అసౌకర్యానికి గురవుతున్నాడని వివరించాడు. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు అతడీ విషయం చెప్పడం గమనార్హం. దుబాయ్ వేదికగా మంగళవారం ముంబయి, దిల్లీ ఇండియన్ టీ20లీగ్ ఫైనల్లో తలపడనున్నాయి.
"ప్రస్తుతానికి అతడు బౌలింగ్ చేసేందుకు సిద్ధంగా లేడు. అందుకే మేం నిర్ణయాన్ని అతడికే వదిలేశాం. అతడికి సౌకర్యంగా అనిపిస్తే ఎప్పుడైనా సంతోషంగా బౌలింగ్ చేయిస్తాం. ఇప్పటికైతే చిన్న చిన్న గాయాలతో ఇబ్బంది పడుతున్నాడు. అందుకే ఈ సీజన్ మొత్తం అతడిని సౌకర్యవంతమైన జోన్‌లోనే ఉంచేందుకు ప్రయత్నించాం. అతడు కోలుకోవడం ఎంతో అవసరం."