తెలంగాణ

telangana

ETV Bharat / sports

నోరూరింది.. మేం దంచికొట్టాం: హార్దిక్

పంజాబ్​తో మ్యాచ్​లో తనకు నోరూరిందని చెప్పిన హార్దిక్ పాండ్య.. ఇన్నింగ్స్​ చివరి ఓవర్​ను స్పిన్నర్​కు ఇవ్వడం తమకు కలిసొచ్చిందని అన్నాడు. సిక్సులు దంచికొట్టాలని ముందే అనుకున్నట్లు వెల్లడించాడు.

Hardik Pandya about KXIP match in ipl 2020
Hardik Pandya about KXIP

By

Published : Oct 2, 2020, 1:21 PM IST

Updated : Oct 2, 2020, 2:50 PM IST

ముంబయి ఇన్నింగ్స్‌లో ఆఖరి ఓవర్‌ను స్పిన్నర్‌ కృష్ణప్ప గౌతమ్‌తో కేఎల్‌ రాహుల్‌ వేయించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అప్పటికే పొలార్డ్‌, హార్దిక్‌ పాండ్య విధ్వంసకరంగా ఆడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో 20వ ఓవర్లో బంతిని స్పిన్నర్‌ చేతికి ఇవ్వడం.. అభిమానులు, విశ్లేషకులను విస్మయానికి గురిచేసింది. అయితే పాండ్యకు మాత్రం నోరూరిందట!

వాస్తవంగా ముంబయి 14 ఓవర్లకు 87/3తో కష్టాల్లో ఉంది. గెలవాలంటే భారీ లక్ష్యం నిర్దేశించాల్సిన పరిస్థితి. దాంతో పొలార్డ్‌ (47*; 20 బంతుల్లో 3×4, 4×6), హార్దిక్‌ (30*; 11 బంతుల్లో 3×4, 2×6) దంచికొట్టడం మొదలు పెట్టారు. 19 ఓవర్లకు 166/4తో నిలిపారు. అలాంటప్పుడు ఆఖరి ఓవర్‌ను ఆఫ్‌స్పిన్నర్‌ గౌతమ్‌కు ఇవ్వడం పంజాబ్‌కు చేటు చేసింది. రెండో బంతిని పాండ్య సిక్సర్‌గా మలిచాడు. ఇక ఆఖరి మూడు బంతుల్ని పొలార్డ్‌ స్టేడియం దాటించాడు. ఐదో బంతికి అతడు 97 మీటర్ల సిక్స్‌ బాదేయడం విశేషం. ఈ ఓవర్లో 25 పరుగులు రావడం వల్ల ప్రత్యర్థికి ముంబయి 192 పరుగుల లక్ష్యం నిర్దేశించింది.

ముంబయి ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య

ఆఖరి ఓవర్‌ కోసం బంతిని కృష్ణప్ప గౌతమ్‌కు అప్పగించగానే తమకు నోరు ఊరినట్టు అనిపించిందని పాండ్య అన్నాడు. నిజానికి తాము ఆ క్షణంలో పరుగులు చేసేందుకు తహతహలాడుతున్నామని వివరించాడు. ఆఫ్‌ స్పిన్నర్‌ అని తెలియగానే పొలార్డ్‌, తాను దంచికొట్టాలని నిర్ణయించుకున్నామని చెప్పాడు. తాను ఒక్క సిక్సరే కొట్టినా పొలార్డ్‌ మూడు సిక్సర్లు బాది భారీ స్కోరును అందించాడని ప్రశంసించాడు.

లీగ్ చరిత్రలో తొలి ఇన్నింగ్స్‌లో 20వ ఓవర్‌ను స్పిన్నర్‌ వేయడం ఇది 18వ సారి. చివరిసారిగా 2014లో వేశారు.

Last Updated : Oct 2, 2020, 2:50 PM IST

ABOUT THE AUTHOR

...view details