మిడిలార్డర్లో ఆడుతున్నందుకు తానేమీ అనుకోవడం లేదని రాజస్థాన్ విధ్వంసకర ఆటగాడు జోస్ బట్లర్ అన్నాడు. జట్టు అవసరాల మేరకు ఏ స్థానంలోనైనా ఆడతానని పేర్కొన్నాడు. సీజన్ ఆరంభం నుంచి ఓపెనింగ్ చేస్తున్న అతడు బెన్‌స్టోక్స్ రాకతో మిడిలార్డర్‌లో ఆడుతున్నాడు. చెన్నైతో మ్యాచులో 48 బంతుల్లో 70 పరుగులతో అజేయంగా నిలిచాడు.
"ఓపెనింగ్‌తో పోలిస్తే మిడిలార్డర్లో ఆడటం భిన్నంగానే అనిపిస్తుంది. మిడిలార్డర్లో మేం ఎక్కువగా స్పందించాలి. మ్యాచులో ముందు జరిగిన దాన్ని సరిచేయాలి. అయితే జట్టు అవసరాల మేరకు ఏ పాత్ర పోషించేందుకైనా నేను సిద్ధమే" అని బట్లర్ అన్నాడు. అతడు మాట్లాడిన వీడియోను రాజస్థాన్ జట్టు ట్వీట్ చేసింది.