తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీ, అనుష్కపై గావస్కర్​ కామెంట్లు.. ఫ్యాన్స్ ఆగ్రహం - సునీల్​ గావస్కర్​ వార్తలు

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు కెప్టెన్​ విరాట్​ కోహ్లీపై టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ సునీల్​ గావస్కర్ చేసిన కామెంట్లు వివాదానికి దారితీశాయి​. కోహ్లీ, అనుష్కలపై అనుచిత వ్యాఖ్యల కారణంగా అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు గావస్కర్.

Gavaskar creates controversy with comment on Kohli and Anushka
కోహ్లీ, అనుష్కలపై గావస్కర్​ కామెంట్లు.. అభిమానుల ఆగ్రహం

By

Published : Sep 25, 2020, 12:16 PM IST

Updated : Sep 25, 2020, 6:00 PM IST

కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు కెప్టెన్​ విరాట్​ కోహ్లీ పేలవ ప్రదర్శనపై మాజీ క్రికెటర్ సునీల్​ గావస్కర్​ కామెంట్​ చేశాడు. కోహ్లీతో పాటు అనుష్క శర్మపైనా అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నాడు.

గావస్కర్​ను తొలగించాలి

పంజాబ్​తో గురువారం జరిగిన మ్యాచ్​లో కోహ్లీ రెండు క్యాచ్​లు వదిలేయడం సహా బ్యాటింగ్​లోనూ విఫలమయ్యాడు. దీనిపై కామెంటరీ బాక్స్​లో ఉన్న గావస్కర్​.. కోహ్లీ, అనుష్కల్ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీనిపై ఆగ్రహించిన విరాట్ అభిమానులు గావస్కర్​ను కామెంటరీ ప్యానెల్​ నుంచి తొలగించాలని బీసీసీఐని కోరారు.

ఆ క్యాచ్​ల విలువ 132 రన్స్​

ఈ మ్యాచ్​లో కోహ్లీ జారవిడిచిన రెండు క్యాచ్​లు కేఎల్​ రాహుల్​కు చెందినవే. దీని వల్ల బెంగళూరు భారీ మూల్యం చెల్లించుకుంది. ఈ ఇన్నింగ్స్​లో కేవలం 69 బంతుల్లో 132 పరుగులు సాధించి.. టోర్నీలో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన తొలి భారతీయుడిగా ఘనత సాధించాడు రాహుల్.

గతంలోనూ కోహ్లీ తన ప్రదర్శనలో విఫలమైన కొన్ని సందర్భాల్లోనూ అనుష్కను జోడించి పలువురు నిందించారు.

Last Updated : Sep 25, 2020, 6:00 PM IST

ABOUT THE AUTHOR

...view details