తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్ 14వ సీజన్​లో కొత్త జట్టు.. మెగా వేలం! - ఐపీఎల్ 14వ సీజన్​లో కొత్త జట్టు

ఎన్నో అనుభూతుల్ని మిగుల్చుతూ ఐపీఎల్ 13వ సీజన్ పూర్తయింది. వచ్చే ఏడాది ప్రారంభంలోనే మరో సీజన్ ప్రారంభంకానుంది. అయితే 14వ సీజన్ కోసం బీసీసీఐ మరో కొత్త జట్టును ప్రకటించనుందట. మెగా వేలం కూడా ఉండబోతుందని తెలుస్తోంది.

Fulll Auction, new team on the cards ahead of IPL 2021
ఐపీఎల్ 14వ సీజన్​లో కొత్త జట్టు.. మెగా వేలం!

By

Published : Nov 11, 2020, 11:54 AM IST

Updated : Nov 11, 2020, 12:52 PM IST

యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 13వ సీజన్ ముగిసింది. ఫ్యాన్స్​కు ఎన్నో జ్ఞాపకాల్ని మిగుల్చుతూ టోర్నీ ఆద్యంతం ఆకట్టుకుంది. దిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన తుదిపోరులో ముంబయి ఇండియన్స్​ విజయం సాధించి ఐదోసారి ట్రోఫీని ముద్దాడింది. అనేక అనుభూతుల మధ్య ఈ టోర్నీ పూర్తయినా.. త్వరలోనే మళ్లీ మరో సీజన్ ప్రారంభం కానుంది. మార్చి-ఏప్రిల్​లో ఐపీఎల్ 14వ సీజన్​ మొదలవనుంది. ఈ టోర్నీకి ముందు అభిమానులకు సర్​ప్రైజ్ ఇవ్వనుంది బీసీసీఐ.

వచ్చే సీజన్​లో మరో కొత్త జట్టును ఏర్పాటు చేయనుంది. అంటే 9 జట్లతో లీగ్​ నిర్వహించున్నారని సమాచారం. ఇప్పటికే కొత్త జట్టును ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. కరోనా వల్ల ఏర్పడిన ఆర్థిక లోటును పూడ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. అలాగే ఈ లీగ్​కు ముందు మెగా వేలం ఉండనుందట. కొత్త సీజన్ ప్రారంభానికి తక్కువ సమయమే ఉండటం వల్ల అసలు వేలం నిర్వహిస్తారో లేదో అనే అనుమానాలు ఉండేవి. కానీ మెగా వేలంతో వచ్చే సీజన్​లో మరింత కిక్ ఇచ్చేందుకు పాలకమండలి సిద్ధమయినట్లు సమాచారం.

Last Updated : Nov 11, 2020, 12:52 PM IST

ABOUT THE AUTHOR

...view details