తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​ చరిత్రలో బుమ్రా తొలిసారి ఇలా! - సుపర్​ ఓవర్​ ముంబయి ఇండియన్స్​

ఐపీఎల్​లో సూపర్​ ఓవర్​కు దారితీసిన మ్యాచుల్లో బుమ్రా బౌలింగ్​ చేయగా ముంబయి ఇండియన్స్​ ఎప్పుడూ గెలుస్తూనే వచ్చింది. కానీ బెంగళూరు జట్టుతో సోమవారం జరిగిన మ్యాచ్​లోనే తొలిసారిగా పరాజయాన్ని చవిచూసింది.

Bumrah
బుమ్రా

By

Published : Sep 29, 2020, 4:09 PM IST

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ మధ్య సోమవారం జరిగిన మ్యాచ్​ సూపర్ ఓవర్‌కు దారితీయగా కోహ్లీ సేన విజయం సాధించింది. అయితే ఇందులో ముంబయి గెలుస్తుందని క్రీడాభిమానులంతా భావించారు. కెరీర్‌లో ఒక్కసారి కూడా సూపర్ ఓవర్‌లో ముంబయి ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్​ బుమ్రా విఫలం కాకపోవడమే ఇందుకు కారణం. కానీ.. బెంగళూరు హిట్టర్ ఏబీ డివిలియర్స్, సారథి విరాట్ కోహ్లీ.. తొలిసారి యార్కర్ల కింగ్​ బుమ్రాకు ఈ పద్ధతిలో పరాజయం రుచిచూపారు. సూపర్ ఓవర్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి 7 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని ఆఖరి బంతికి ఛేదించింది బెంగళూరు.

బుమ్రా

కెరీర్​లో ఐదుసార్లు

కెరీర్‌లో బుమ్రా ఇప్పటి వరకూ ఐదు సార్లు సూపర్ ఓవర్‌లో బౌలింగ్ చేయగా.. బెంగళూరుపై మినహా అన్ని మ్యాచ్‌ల్లోనూ అతడు విజయవంతమయ్యాడు. ఇందులో రెండు మ్యాచ్‌ల్లో టీమ్​ఇండియా తరఫున బౌలింగ్ చేశాడు.

కాగా, ఐపీఎల్‌ 2017లో జరిగిన సూపర్ ఓవర్‌ మ్యాచ్‌లో 12 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన గుజరాత్‌ లయన్స్‌ను బుమ్రా 6/0కే పరిమితం చేసి ముంబయిని గెలిపించాడు. ఆ తర్వాత 2019లోనూ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను సూపర్ ఓవర్‌లో 8/2కి కట్టడి చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.

ఇదీ చూడండి ముంబయిపై బెంగళూరు 'సూపర్'​ విజయం

ABOUT THE AUTHOR

...view details