ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వాట్సన్ అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. నాలుగేళ్ల క్రితమే ఇతడు అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకగా.. తాజాగా లీగ్ల నుంచీ తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు. కెరీల్లో అండగా నిలిచిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ.. తన చిన్ననాటి స్మృతులను గుర్తుచేసుకుంటూ ఓ వీడియోను సోషల్మీడియాలో పోస్ట్ చేశాడు.
"ఓ అద్భుత ఘట్టం ముగిసింది. నా జీవితంలోని రెండో ఘట్టంలోకి అడుగుపెడుతున్నందుకు ఎంతో ఉత్సుకతతో ఉన్నా. నా కలలను సాకారం చేసుకోవడానికి తోడ్పడిన ప్రతిఒక్కరికీ ధన్యావాదాలు. ఓ కలతో నా కెరీర్ ప్రారంభమైంది. నా ఐదేళ్ల వయసులో టెస్టు మ్యాచులు చూసేవాడిని. అప్పుడు మా అమ్మగారికి ఆస్ట్రేలియా తరపున క్రికెట్ ఆడాలని చెప్పేవాడిని. ఇప్పుడు అన్ని ఫార్మాట్ల నుంచి ఏకంగా రిటైర్మెంట్ ప్రకటించా. నా కలను సాకారం చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. ఇదంతా చూస్తుంటే భలే ఉంది. నా చివరి మ్యాచ్ను సీఎస్కే తరఫున ఆడినందుకు ఎంతో సంతోషంగా ఉంది. గత మూడేళ్ల నుంచి చెన్నై జట్టు నన్ను చాలా బాగా చూసుకుంది."
-వాట్సన్, ఆస్ట్రేలియా క్రికెటర్.