సన్రైజర్స్ హైదరాబాద్ విజయరహస్యాన్నివెల్లడించారు ఆ జట్టులోని బౌలర్ భువనేశ్వర్ కుమార్ చిన్ననాటి కోచ్ సంజయ్ రాస్తోగి. టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకోవడమే వారికి బలమని చెప్పారు. అందుకే గతేడాది ఎక్కువ మ్యాచులు గెలిచిందని అన్నారు. ఇదే ఫార్ములాను ఈ సీజన్లోనూ కొనసాగించాలని సూచించారు. తద్వారా ఎక్కువగా గెలిచే అవకాశముందన్నారు. బలమైన బ్యాటింగ్ లైనప్ లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ మెగాలీగ్లో తన ఫేవ్రేట్ జట్టు హైదరాబాద్ అని చెప్పిన సంజయ్... భువనేశ్వర్ కుమార్, ప్రియమ్ గార్గ్ ఆ ఫ్రాంచైజీలో ఉండటమే అందుకు కారణమని అన్నారు.