రాజస్థాన్ జట్టుతో జరిగిన కీలకమైన మ్యాచ్‌లో ఓటమిపాలైంది సీఎస్కే. ఐతే, ప్రతి మ్యాచ్ అనుకున్న విధంగా ఉండదని చెన్నె సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ అన్నాడు. బౌలింగ్ విషయంలో ఆచితూచి అడుగేసినా దాని పరిణామం భిన్నంగా ఉందని పేర్కొన్నాడు. ఈ సీజన్లో ఫైనల్‌కు చేరుకోలేమంటూ విచారం వ్యక్తం చేశాడు.
" ఒక పద్ధతిని అనుసరించే క్రమంలో కొన్ని తప్పిదాలు జరిగాయి. కానీ, దీని వల్ల పాజిటివ్‌గా ఆలోచించే శక్తి పెరుగుతుంది. వేల మంది ప్రజల ముందు మేం ఆడుతున్నాం కాబట్టి ఏదీ దాచాల్సిన పనిలేదు. ముందుగా ఆటగాడికి అవకాశం ఇవ్వాలి. తను బాగా రాణించకపోతే తన స్థానంలో వేరే ఆటగాడిని తీసుకోవాలి. అంతేగాని ఆటగాడిలో అభద్రతా భావం కల్పించకూడదు ".
-ఎంఎస్ ధోని, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్